కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయిన పోలవరం ?

కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయిన పోలవరం ?

చివరకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రేపటి ఎన్నికల్లో పోలవరం అంశం చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని టిడిపిలు ఈ విషయంలో ఒకదానికి మించి మరొకటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అవసరమైతే రెండు పార్టీలు ఎదుటి పార్టీని జనాల ముందు దోషిగా నెలబెట్టేందుకు రంగం సైతం సిద్ధం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది.

 

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. కాబట్టి పోలవరం నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే అన్న విషయం అందరికీ తెలుసు. అయితే, కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు కేంద్రం నుండి ప్రాజెక్టును బలవంతంగా తన చేతుల్లోకి లాక్కున్నారు. అక్కడి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయ.

 

ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు లెక్కలు చెప్పకపోవటం కేంద్రానికి బాగా కలసివచ్చింది. అదే అంశాన్ని పట్టుకుని కేంద్రం, చంద్రబాబును బాగా బిగించేసింది. ఇచ్చిన నిధులకు లెక్కలు చెబితేకానీ తదుపరి నిధులు ఇచ్చేది లేదని స్పష్టంగా తేల్చేసింది. అప్పటి నుండి చంద్రబాబులో సఫకేషన్ మొదలైంది.

 

అదే సందర్భంలో కొన్ని పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన టెండర్లను కేంద్రం నిలిపేసింది. నిబంధనల ప్రకారం రాష్ట్రప్రభుత్వం నడుచుకోలేదని కేంద్రం మండిపడింది. అంతర్జాతీయ టెండర్లు పిలిచినపుడు ఇవ్వాల్సిన 45 రోజుల గడువును రాష్ట్రప్రభుత్వం 18 రోజులకు కుదించింది. అదే సమయంలో పేపర్ ప్రకటనలో ఇచ్చిన విలువకన్నా ఆన్ లైన్లో ఇచ్చిన ప్రకటన సుమారు రూ. 100 కోట్లు అదనంగా ఉంది. ఇదే విషయాన్ని కేంద్రం ప్రశ్నించినపుడు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారు. ఇటువంటి అనేక అంశాల్లో కక్కుర్తి పడటంతో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

 

తాజాగా ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు రూ. 58 వేల కోట్ల ప్రతిపాదనలను కూడా కేంద్రం రెజెక్ట్ చేసింది. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. అంతేకాకుండా పోలవరం పనులను రెగ్యులర్ గా పర్యవేక్షించటమే కాకుండా ప్రతీ 15 రోజులకు ఒకసారి తానే స్వయంగా ప్రాజెక్టు పనులను సమీక్ష చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయించటం కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. రేపటి ఎన్నికల్లో మిత్రపక్షాలు గనుక విడిపోతే అప్పుడు మొదలవుతుంది పోలవరంపై అసలు డ్రామా...

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page