ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పింది.
పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందులతో ఏపీ సర్కార్ తంటాలు పడుతున్న (ap financial status) సంగతి తెలిసిందే. భారీగా రుణ సమీకరణతో ఎలాగోలా బండిని నెట్టుకోస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ సర్కార్ ఉల్లంఘించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కాగ్ నిర్ధారించిందని కేంద్ర ఆర్థిక శాఖ (central finance ministry) స్పష్టం చేసింది. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో 377 నిబంధన కింద తెలుగుదేశం పార్టీ (telugu desam party) ఎంపీ రామ్మోహన్ నాయుడు (rammohan naidu) లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలియజేసింది.
‘వైఎస్ గృహ వసతి’ ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చామని.. జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.570.91 కోట్లు ఇచ్చామని ఆర్ధిక శాఖ తెలిపింది. 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి నివేదికలో ఈ విషయాన్ని కాగ్ స్పష్టంగా వెల్లడించింది. రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ సర్కార్ మళ్లించిందని ఆర్ధిక శాఖ పేర్కొంది.
ఈ మొత్తాన్ని స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించారని తెలిపింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మళ్లీంచారని, కానీ రైతులకు మాత్రం ఆ నిధులు అందించలేదని కేంద్రం పేర్కొంది. విపత్తు సాయానికి ఖర్చు చూపించి ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘనకు పాల్పడిందని.. ఏపీ సర్కార్ పూర్తిగా ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించింది అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇకపోతే.. Andhrapradesh కు సంబంధించి 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆదాయాన్ని వాస్తవికంగా అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్టు Union Finance Minister నిర్మలా సీతారామన్ గతేడాది డిసెంబర్‌లో పేర్కొన్నారు. Revenue expenditure నియంత్రించలేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం కాలావధి మొత్తంతో పాటు, 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21లో రెవెన్యూ లోటు గ్రాంట్ మంజూరు చేసినా ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ లోటు లో పెరుగుదల కనిపించినట్లు ఆమె పేర్కొన్నారు.
రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 2015-16 తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందుకు ఖర్చు చేయడమే అని Nirmala Sitharaman చెప్పారు. 2019-20లో బడ్జెట్ లో పేర్కొన్న రూ.1,779 కోట్లకు మించి రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలేనని నిర్మలాసీతారామన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021- 22 వరకు గత ఎనిమిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు పన్నుల వాటా కింద మొత్తం రూ. 4,40,985 కోట్ల ఆర్థిక వనరులు అందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు.
