Asianet News TeluguAsianet News Telugu

రెవిన్యూలోటు పై కేంద్రం షాక్

  • గడచిన మూడేళ్లుగా రాష్ట్రప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్న రూ.16వేల కోట్ల రెవిన్యూలోటును తాజాగా తోసిపుచ్చింది కేంద్రం.
  • తమ లెక్కల ప్రకారం రెవిన్యూలోటు రూ. 4117 కోట్లేనంటూ రాష్ట్రానికి స్పష్టం చేసింది.
  • అందులో కూడా ఇప్పటికే రూ. 2300 కోట్లు ఇచ్చేసామని, మిగిలింది ఇస్తామని తేల్చేసింది.
  • రెవిన్యూలోటుపై రాజ్యసభలో వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు విజయసాయిరెడ్డి, కెవిపి రామచంద్రరావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ స్పష్టతనిచ్చేసారు.
Center shocks state govt over revenue deficit

రెవిన్యూలోటు విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. గడచిన మూడేళ్లుగా రాష్ట్రప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్న రూ.16వేల కోట్ల రెవిన్యూలోటును తాజాగా తోసిపుచ్చింది కేంద్రం. తమ లెక్కల ప్రకారం రెవిన్యూలోటు రూ. 4117 కోట్లేనంటూ రాష్ట్రానికి స్పష్టం చేసింది. అందులో కూడా ఇప్పటికే రూ. 2300 కోట్లు ఇచ్చేసామని, మిగిలింది ఇస్తామని తేల్చేసింది. రెవిన్యూలోటుపై రాజ్యసభలో వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు విజయసాయిరెడ్డి, కెవిపి రామచంద్రరావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ స్పష్టతనిచ్చేసారు. అంటే ఇక రెవిన్యూలోటు వస్తుందని ఇంతకాలం రాష్ట్రప్రభుత్వం పెట్టుకున్న ఆశలన్నీ వమ్మైనట్లే.

పైగా ‘మీ లెక్కలతో మాకు సంబంధం లేదు. మా లెక్కలు మా దగ్గరున్నాయ్’ అంటూ చెప్పటం గమనార్హం. ‘విభజన తర్వాత రాష్ట్రప్రభుత్వం వివిధ పథకాలపై పెట్టిన ఖర్చులన్నింటినీ రెవిన్యూలోటుగా ఎలా చూస్తామం’టూ నిలదీసింది. పైగా ‘విభజన తర్వాత రైతురుణమాఫీకి ప్రభుత్వం రూ. 7069 కోట్లు, సామాజిక భద్రతలో భాగంగా పెన్షన్ మొత్తాన్ని పెంచటం వల్ల రూ. 3391 కోట్లు, డిస్కంలకు విద్యుత్ బకాయాలు చెల్లింపులకు రూ. 1500 కోట్లతో కేంద్రానికి ఎటువంటి సంబంధమూ లేద’ని కేంద్రం తేల్చేసింది.

అంటే, విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాల్లోనే కాదు రెవిన్యూలోటు భర్తీ లాంటి విషయాలపైన కూడా ఇటు చంద్రబాబునాయుడు, అటు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు మాటలు చెల్లుబాటు కాలేదన్న విషయం స్సష్టమైంది. ఏదో జనాలను మభ్య పెట్టటానికి, మీడియాలో పాజిటివ్ వార్తలు రాయించుకోవటానికి తప్ప చంద్రబాబు, వెంకయ్యల స్టేట్మెంట్లు ఎందుకు పనికిరాలేదు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఏదో విధంగా రెవిన్యూలోటును కూడా వెంకయ్య భర్తీ చేయించలేకపోయారంటే  ఆశ్చర్యంగానే ఉంది. కేంద్రంలో తానుండబట్టే రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులని, లక్షల కోట్ల నిధులు వస్తున్నాయని ఇంతకాలం వెంకయ్య చెబుతున్న మాటలన్నీ ఉత్త డొల్లే అని తేలిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios