మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నలుగురిపై అభియోగాలను మోపుతూ సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జీషీట్ వేశారు.

కడప: మాజీ మంత్రి Ys Vivekananda Reddy హత్య కేసులో CBI ఛార్జీషీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో నలుగురిపై అభియోగాలను మోపింది.గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిలపై అభియోగాలను మోపింది.

also read:వైఎస్ వివేకా హత్య కేసులో మరొకరి అరెస్టు: ముందు కుక్కను చంపేసి....

Charge sheet లో అభియోగాలు మోపిన వారికి సంబంధించిన సాక్ష్యాలను కూడ కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు.ఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో నిందితులను అరెస్ట్ చేశామని సీబీఐ ఛార్జీషీట్ లో తెలిపింది. అయితే నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని కూడా సీబీఐ అధికారులు వివరించారు. Sunil Yadavను ఆగష్టు 4వ తేదీన గోవాలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించారు. అయితే 90 రోజుల వ్యవధిలో ఛార్జీషీట్ దాఖలు చేయాలి. నవంబర్ 4వ తేదీతో 90 రోజులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది సీబీఐ.

ఈ కేసులో Uma Shankar Reddy ని ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. సుమారు ఐదు బ్యాగుల నిండా ఛార్జీషీట్ కు సంబంధించిన పత్రాలతో పాటు సాక్ష్యాలను కూడ సీబీఐ అధికారులు కోర్టుకు తీసుకు వచ్చారు. మిగిలిన ఇద్దరిపై కూడ అభియోగాలను సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో పేర్కొంది. అయితే ప్రాథమిక ఛార్జీషీట్ కు అనుబంధంగా పూర్తి ఛార్జీషీట్ ను దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. పూర్తిస్థాయి ఛార్జీషీట్ ను కూడా దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారని సమాచారం.

2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై అప్పటి చంద్రబాబునాయుడు సర్కార్ సిట్ విచారణ నిర్వహించింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ సిట్ విచారణ నిర్వహించింది. అయితే ఈ విషయమై అసలు దోషులను పట్టుకోవాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సహా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు ఏపీ హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా కారణంగా ఈ హత్యపై విచారణలో వేగం తగ్గింది. అయితే ఈ ఏడాది మార్చి మాసంలో ఢిల్లీకి వెళ్లిన వైఎస్ వివేకా కూతురు ఈ కేసు దర్యాప్తులో ఆలస్యంపై సీబీఐకి వినతిపత్రం సమర్పించింది. దీంతో మరోసారి ఈ కేసు దర్యాప్తులో కదలికి వచ్చింది.

కడప జిల్లా కేంద్రంలో ఉంటూ ఈ కేసులో అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగయ్య సాక్ష్యం ఆధారంగా సీబీఐ అనుమానితులను అదుపులోకి తీసుకొంది. అనుమానితులుగా ఉన్న వారిని పలుమార్లు విచారించిన తర్వాత కొన్ని సాక్ష్యాలను కూడా సేకరించినట్టుగా సీబీఐ ప్రకటించింది.