పెన్నా సిమెంట్ కేసు అనుబంధ ఛార్జిషీట్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కొద్దిరోజుల క్రితం సీబీఐ ఛార్జీషీటును దాఖలు చేసింది.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, రిటైర్డ్ అధికారులు శామ్యూల్, రాజగోపాల్‌ను నిందితులుగా పేర్కొంది.

ఛార్జీషీటు దాఖలకు ముందు మరికొన్ని ఆధారాలు సేకరించిన సీబీఐ కోర్టు..అప్పట్లో స్థానికంగా అధికారులుగా పనిచేసిన ఆర్డీవో, తహశీల్దార్‌ను కూడా నిందితులుగా చేరుస్తూ మరో అనుబంధ ఛార్జీషీటును దాఖలు చేశారు.

Also Read:ఈడీ కేసులో మినహయింపు కోరిన జగన్

ఇప్పటికే సీబీఐ దర్యాప్తును పూర్తి చేసిందని, మళ్లీ దీనిపై ఛార్జీషీటు ఏంటంటూ జగన్ తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అయినప్పటికీ న్యాయస్థానం మాత్రం సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జీషీటును పరిగణనలోనికి తీసుకుని నోటీసులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. కొత్తగా చేర్చిన ఛార్జీ షీటు ప్రకారం.. డీఆర్‌వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ యల్లమ్మలు కూడా కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. 

అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు విచారించింది. ఆస్తుల కేసులో ఇవాళ తప్పనిసరిగా హాజరుకావాలని ఈ నెల 3వ తేదీన సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుకు  హాజరయ్యారు. ఈ కేసును  ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది కోర్టు 

ఏపీ సీఎం వైఎస్ జ‌గన్ కు  సీబీఐ కోర్టు ఈ నెల 3వ తేదీన షాకిచ్చింది. ఈ నెల 10 వ తేదీన  కోర్టుకు జగన్ హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ప్రతి శుక్రవారం నాడు  సీబీఐ కోర్టుకు హాజరు కావాలనే విషయమై మినహాయింపును ఇవ్వాలని గతంలో కూడ కోర్టును జగన్ తరపున లాయర్లు కోరారు.  

Also Read:ఆస్తుల కేసు: సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్

ఇప్పటికే 10 దఫాలు జగన్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నెల 10వ తేదీన సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏ 2 గా ఉన్న  విజయసాయిరెడ్డి కూడ కోర్టుకు హాజరుకావాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో వైఎస్ జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో తాను హాజరుకాకుండా మినహయింపు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. తన తరపున తన సహ నిందితుడు ఈ కేసులో హాజరు అవుతారని జగన్ కోరారు.