హైదరాబాద్: తన తరపున సహ నిందితుడు ఈడీ కేసులో కోర్టుకు హాజరు అవుతారని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుకు వివరించారు.  ఈడీ కేసులో వ్యక్తిగతంగా తన హజరును మినహయించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. 

Also read:ఆస్తుల కేసు: సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్

ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు విచారించింది.

Also read:అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

ఆస్తుల కేసులో ఇవాళ తప్పనిసరిగా హాజరుకావాలని ఈ నెల 3వ తేదీన సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుకు  హాజరయ్యారు. ఈ కేసును  ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది కోర్టు 

ఏపీ సీఎం వైఎస్ జ‌గన్ కు  సీబీఐ కోర్టు ఈ నెల 3వ తేదీన షాకిచ్చింది. ఈ నెల 10 వ తేదీన  కోర్టుకు జగన్ హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ప్రతి శుక్రవారం నాడు  సీబీఐ కోర్టుకు హాజరు కావాలనే విషయమై మినహాయింపును ఇవ్వాలని గతంలో కూడ కోర్టును జగన్ తరపున లాయర్లు కోరారు.  

ఇప్పటికే 10 దఫాలు జగన్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నెల 10వ తేదీన సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏ 2 గా ఉన్న  విజయసాయిరెడ్డి కూడ కోర్టుకు హాజరుకావాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో వైఎస్ జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో తాను హాజరుకాకుండా మినహయింపు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. తన తరపున తన సహ నిందితుడు ఈ కేసులో హాజరు అవుతారని జగన్ కోరారు.