ఉమ్మడి హైకోర్టు మరికొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్ నుండి కదిలేట్లు కనబడటం లేదు.   కోర్టుభవనాలు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు తదితర అవసరమైన వసతులన్నీ సిద్దమైన తర్వాతే ఏపిలో హై కోర్టు ఏర్పాటవుతుందని స్పష్టం చేసారు. అంటే కేంద్ర సహాయమంత్రి చెప్పినదాన్ని బట్టి ఏపిలో హైకోర్టు ఏర్పాటవ్వటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో?

ఉమ్మడి హైకోర్టు మరికొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్ నుండి కదిలేట్లు కనబడటం లేదు. ఏపిలో హైకోర్టును ఏర్పాటు చేసే విషయమై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఈ విషయం స్పష్టమైంది. హై కోర్టు తరలింపుపై వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్న వేసారు. న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరి సమాధానమిస్తూ కోర్టుభవనాలు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు తదితర అవసరమైన వసతులన్నీ సిద్దమైన తర్వాతే ఏపిలో హై కోర్టు ఏర్పాటవుతుందని స్పష్టం చేసారు. అంటే కేంద్ర సహాయమంత్రి చెప్పినదాన్ని బట్టి ఏపిలో హైకోర్టు ఏర్పాటవ్వటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో?

హైదరాబాద్ లోని హైకోర్టు జ్యూడికేచర్ తో సంప్రదించి వసతులన్నీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైనే ఉందట. పైగా ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రిని కూడా కోరినట్లు కేంద్రమంత్రి చెప్పటం గమనార్హం. అసలు, రాజధాని ఏర్పాటు ప్రక్రియే ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు. ఇక హై కోర్టుకు దిక్కేక్కడ?

రాజధాని ప్లాన్ ఇది అంటూ చంద్రబాబునాయుడు ఇప్పటికి రెండు సంవత్సరాలుగా గ్రాఫిక్స్ చూపుతున్నారే గానీ ఒక్కటి కూడా ఖరారు చేయలేదు. ప్లాన్ ఎప్పటికి ఖరారవ్వాలి? ఎప్పటికి నిర్మాణాలు ఆరంభమై పూర్తవ్వాలి? చంద్రబాబు చెప్పేదానికి క్షేత్రస్ధాయి పరిస్ధితులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు రాజధాని నిర్మాణానికి సంబంధించి నిజంగా ఏం జరగుతోందో ఎవ్వరికీ తెలీదు. అందుకేనేమో కేంద్రప్రభుత్వం కూడా హైకోర్టు ఏర్పాటుపై అన్ని మెలికలు పెట్టి వదిలేసింది.