అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. సోషల్ మీడియా వేదికన విజయసాయి రెడ్డికి స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా లోకేష్ తాడిపత్రి పర్యటనపై విజయసాయి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బుద్దా రియాక్ట్ అయ్యారు.
 
''లోకేష్ కార్యకర్త కోసం ఎంత దూరం అయినా వెళ్లడం చూసి వణుకుతున్నావ్ ఏంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు.తాడిపత్రి లో లోకేష్ తనపాటు తెచ్చుకున్న క్యారెజ్ అది కూడా డైటింగ్ లో భాగమైన ఆకుకూరల భోజనం తిన్నారు. దీనిని కూడా రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నారు చూడు అది మీ తింగరి మాలోకం వైఎస్ జగన్ రేంజ్'' అని లోకేష్ తాడిపత్రి పర్యటనపై బుద్దా వివరణ ఇచ్చారు. 

read more  టేస్టీ ఫుడ్ మాలోకం, తాడిపత్రికి అందుకే....లోకేష్ పై విజయసాయి సెటైర్లు
 
''మీ తింగరి మాలోకం అవినీతి సొమ్ము బొక్కడానికి తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నాడు. ఓదార్పు అంటూ సోకాలు పెట్టాడు, పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేసాడు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరు పప్పే'' అంటూ మరో  ట్వీట్ ద్వారా మండిపడ్డారు.

''43 వేల కోట్ల దోపిడీ కేసులో ఏ1, ఏ2ల‌ బెయిల్ కోసం నువ్వూ, గ‌నుల కేసులో గాల‌న్న‌య్య జ‌డ్జిల‌నే కొనాల‌నుకుని అడ్డంగా బుక్క‌య్యారు మ‌రిచిపోయారా విజయసాయి రెడ్డి! తాజాగా లాయర్ కి 5 కోట్లిచ్చిన సంగ‌తో! ఎంత పెద్ద లాయర్ కి అడ్వాన్స్ ఇచ్చినా శుక్రవారం నుండి ఉపశమనం దక్కడం లేదు పాపం'' అంటూ  ఎద్దేవా చేశారు.
 
''అడ్డదారులు తొక్కి, అడ్డమైన రాతలు రాసి వైఎస్ జగన్ ని జైలు కి పంపిన మీరు మాలోకం అనే విషయం గుర్తించకపోవడం శోచనీయం విజయసాయి రెడ్డి. నిన్ను నమ్మి క్విడ్ ప్రో కో,సూట్ కేసు కంపెనీలు,  మనీ లాండరింగ్ కి పాల్పడి 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి తింగరి మాలోకం,  గన్నేరు పప్పు అని ప్రపంచమంతా వినికిడి మీ చెవికి చేరలేదా లేక అది కూడా మీ స్కెచ్ లో భాగమేనా'' అని జగన్, విజయసాయి రెడ్డిలపై విరుచుకుపడుతూ వెంకన్న ట్వీట్ చేశారు.