Asianet News TeluguAsianet News Telugu

టేస్టీ ఫుడ్ మాలోకం, తాడిపత్రికి అందుకే....లోకేష్ పై విజయసాయి సెటైర్లు

ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ లో లోకేష్ పై పంచులు వేశారు విజయసాయి రెడ్డి. నారా లోకేష్ తిండి ప్రియుడంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేసారు. 

YCP MP Vijayasai reddy Satirically Pokes At Nara Lokesh
Author
Hyderabad, First Published Jun 18, 2020, 10:45 AM IST

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ప్రతిపక్ష టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ లో లోకేష్ పై పంచులు వేశారు విజయసాయి రెడ్డి. నారా లోకేష్ తిండి ప్రియుడంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేసారు. 

"తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం." అంటూ ట్వీట్ చేసారు. 

ఇకపోతే.... మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత సోమవారం నాడు పరామర్శించారు.ఈ పరామర్శలకు వెళ్ళినసందర్భాన్నే ఎత్తి చూపెడుతూ విజయసాయి ట్వీట్ చేసారు. 

నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున కడప జైలుకు తరలించారు.

కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పరామర్శించేందుకు లోకేష్ ఈ నెల 14న కడపకు వెళ్లారు.  కరోనా కారణంగా కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.దీంతో ఇవాళ జేసీ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రోడ్డు మార్గంలో లోకేష్ అనంతపురం పట్టనానికి చేరుకొన్నారు.

నకిలీ పత్రాలతో వాహనాలు విక్రయించారనే కేసు వివరాలను జేసీ పవన్ కుమార్ రెడ్డి నుండి లోకేష్ అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై లోకేష్ జేసీ కుటుంబసభ్యులతో చర్చించారు. 

నకిలీ పత్రాలతో తమకు వాహనాలను విక్రయించారని నాగాలాండ్ డీజీపీకి తామే ఫిర్యాదు చేసినట్టుగా ఈ కేసు విషయమై జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈ నెల 13వ తేదీన మీడియాకు వివరించారు. తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios