విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 9వ తేదీనుంచి చంద్రబాబు ఫోబియా పట్టుకుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.  రాష్ట్రంలో అసలైన వెన్నుపోటు దారులు జగన్, పెద్దిరెడ్డిలే అని ప్రజలకు బాగా తెలుసన్నారు.  సొంతబాబాయిని దారుణంగా నరికి చంపించి, బాత్రూమ్ లోపడుకోబెట్టి, హార్ట్ ఎటాక్ డ్రామాలాడిన జగన్ ను మించిన వెన్నుపోటు దారుడెవడూ ఉండడని ఆరోపించారు. 

''చిత్తూరు జిల్లా కేంద్రంగా డబ్బు, అధికారబలంతో  ఏకగ్రీవాలు చేయించి, ఇసుక, ఎర్రచందనం మాఫియాల్లో మునిగితేలుతున్న పెద్దిరెడ్డి కన్నా మించిన వెన్నుపోటు దారులు ఎవరైనా ఉంటారా? పెద్దిరెడ్డికి నిజంగా అంతటి ప్రజాబలమే ఉంటే, ఆయన తక్షణమే తన పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసి ఏకగ్రీవంగా గెలవాలి. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ప్రతిపక్షానికి చెందినవారిని కుప్పంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారా?'' అని అడిగారు. 

''విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో జగన్నాటకం మొత్తాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బయటపెట్టేశారు. ఆ దెబ్బకు భయపడే విజయసాయి విశాఖకు వచ్చి, కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియకుండా మాట్లాడాడు.  నిజంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో జగన్ కు సంబంధం లేకుంటే,ఆయన తక్షణమే తనపార్టీకి చెందిన 28 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలి'' అని డిమాండ్ చేశారు.

read more   స్పైడర్ సినిమాలో భైరవుడిలాగే విజయసాయి రెడ్డి కూడా: బుద్దా ఆగ్రహం .

వైసిపి ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల కంటే విశాఖ ఉక్కు నష్టాలు తక్కువే అంటూ తెలుగుదేశం వెంకన్న వైసీపీని దుయ్యబట్టారు. 28 మంది ఎంపీలు ఉండి మీరు ఏం పీకుతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించే స్థాయి మీకు లేదా అని ప్రశ్నించారు. పోస్కో ప్రతినిధులను ముఖ్యమంత్రి తాడేపల్లిలో కలవడం నిజం కాదా అని ప్రశ్నించారు. దీంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉంది కాబట్టే కేంద్రాన్ని ప్రశ్నించలేక లేకపోతున్నారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అందరి నెత్తిన చెయ్యి పెట్టాడన్నారు. 

అంతగా చదువు లేకపోయినా ముఖ్యమంత్రిగా అంజయ్య సుపరిపాలన చేశారు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి దోచుకుతినడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ వై జాలి చూపించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా నిమిత్త మాతృడేనని పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలపై ఆయనకు కూడా అవగాహన లేదని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డికి అధికార మదం బాగా నెత్తికెక్కిందని,  అందుకే ఆయనకు ప్రజలన్నా, చివరికి ఉపరాష్ట్రపతి అన్నా లెక్కలేదని విరుచుకుపడ్డారు.