తోటి విద్యార్థినిపై బిటెక్ విద్యార్థుల రేప్: వీడియో తీసి బ్లాక్ మెయిల్

BTech students rape girl student
Highlights

ఇద్దరు బిటెక్ విద్యార్థులు తమ తోటి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు.

విజయవాడ: ఇద్దరు బిటెక్ విద్యార్థులు తమ తోటి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు. పుట్టిన రోజు పార్టీకని పిలిచి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు గ్రామంలో చోటు చేసుకుంది. 

బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలను ఎస్సై ఏసేబు  వెల్లడించారు.

2015 ఫిబ్రవరి నెలలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని తన తోటి విద్యార్థి వంశీకృష్ణ తన పుట్టిన రోజు పార్టీ ఇస్తానని చెప్పి మరో సీనియర్‌ శివారెడ్డితో కలిసి ఆగిరిపల్లిలోని ఓ గదికి తీసుకువెళ్లాడు. గదిలో ఎవరూ లేరేమిటని యువతి ప్రశ్నించే లోగానే వారిద్దరూ బలవంతంగా తలుపులు వేసి ఆమెపై అత్యాచారం చేశారు. 

ఆ సంఘటనను వీడియో తీశారు.  ఆ తర్వాత వీడియోను విద్యార్థినికి చూపించి ఇంట్లోవాళ్లకు చెప్తే దాన్నిబయటపెడుతామని బెదిరించారు. దీంతో విద్యార్థిని అప్పటి నుంచి ఎవరికీ విషయం చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ వచ్చింది.. 

అయితే ఇంట్లో అనుమానం వచ్చి తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పింది. దీంతో 2018 మే నెలలో కళాశాల యాజమాన్యానికి జరిగిన సంఘటనపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశారు. 

అయితే ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం మందలించి వదిలేసింది. అయితే అత్యాచారం చేసిన విద్యార్థి స్నేహితుడు ప్రవీణ్‌ ఇటీవల మొబైల్ ద్వారా విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వద్ద అత్యాచార వీడియో ఉందని రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. 

అయితే గ్రామంలోని మరో ఒకరిద్దరి మొబైల్ ఫోన్లకు ఈ వీడియోలు వెళ్లిన విషయం విద్యార్థిని తండ్రికి తెలిసింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

loader