Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో అమరావతి జేఎసీ సభకు బీజేపీ మద్దతు: సోము వీర్రాజు


రేపు తిరుపతిలో అమరావతి జేఎసీ నిర్వహించే సభకు బీజేపీ మద్దతును ప్రకటించింది. బీజేపీ తరపున ఈ సభకు కన్నా లక్ష్మీనారాయణ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

Bjp Supports Amaravati jac Tirupati Sabha: Somu Veerraju
Author
Guntur, First Published Dec 16, 2021, 5:11 PM IST | Last Updated Dec 16, 2021, 5:11 PM IST

అమరావతి: రేపు తిరుపతిలో Amaravati జేఎసీ నిర్వహించే సభకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని Bjp  ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerraju చెప్పారు. గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  న్యాయస్థానం నుండి దేవస్థానం నినాదంతో  అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన padayatra రెండు రోజుల క్రితం ముగిసింది. నవంబర్ 1 నుండి సుమారు 500 కి.మీ మేర రైతులు పాదయాత్రగా అమరావతి నుండి Tirupatiకి చేరుకొన్నారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏపీ హైకోర్టు నిన్ననే అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే.

also read:కుళ్లిన గుడ్లు పెట్టి.. పిల్లలను ఆసుపత్రుల పాలు చేస్తారా: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

తిరుపతిలో అమరావతి జేఎసీ నిర్వహించే సభలో తమ పార్టీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరౌతారని  సోము వీర్రాజు చెప్పారు.రాష్ట్ర అభివృద్దికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అన్యాయం జరగదన్నారు.ఇదిలా ఉంటే అమరావతి జేఎసీ తిరుపతిలో నిర్వహిస్తున్న సభను ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సభగా అభివర్ణించారు. టీడీపీయే ఈ యాత్రను నడిపించిందన్నారు. మూడు ప్రాంతాల అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని Botsa Satyanarayana చెప్పారు.Three Capitals నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్రను నిర్వహించారు.

దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగింది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ప్రకటించాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios