Asianet News TeluguAsianet News Telugu

కుళ్లిన గుడ్లు పెట్టి.. పిల్లలను ఆసుపత్రుల పాలు చేస్తారా: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వంపై (ysrcp) విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మీరు కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై, కుళ్లిపోయిన గుడ్లతో వంటలు చేసేవారిపై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సోము వీర్రాజు..  సీఎం జగన్‌ను కోరారు. 

ap bjp chief somu veerraju writes letter to ys jagan
Author
Amaravathi, First Published Dec 16, 2021, 4:03 PM IST | Last Updated Dec 16, 2021, 4:03 PM IST

వైసీపీ ప్రభుత్వంపై (ysrcp) విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం (midday meal scheme) కింద వేల కోట్ల రూపాయల నిధులను అందిస్తోందని సోము వీర్రాజు చెప్పారు. మీరు కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై, కుళ్లిపోయిన గుడ్లతో వంటలు చేసేవారిపై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సోము వీర్రాజు..  సీఎం జగన్‌ను కోరారు. 

అంతకుముందు కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. బీజేపీ భవిష్యత్ కార్యాచరణను వివ‌రించారు. జ‌గ‌న్ స‌ర్కార్ ప‌నితీరును విమర్శిస్తూనే.. త‌న రాజకీయ భ‌విష‌త్య్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత తాను రాజ‌కీయాల్లో ఉండ‌న‌నీ, ఆ తరువాత  రాజకీయాలకు గుడ్ బై చెప్ప‌న‌ని వీర్రాజు ప్ర‌క‌ట‌న చేశారు. తనకు పదవుల మీద ఆశలేదని, 42 ఏళ్లుగా ఈ వ్యవస్థలో ఉన్నానని తెలిపారు. 2024లో రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌ర‌మెంతైనా ఉంద‌నీ, ఏపీని ప‌రిపాలించే స‌త్తా బీజేపీకే ఉంద‌నీ, ఈ సారి బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు సోము వీర్రాజు. తనకేం సీఎం అవ్వాలన్న కోరిక లేదన్నారు.  గతంలో పదవులు పొందే అవకాశం వచ్చినా తాను తిరస్కరించానని జ్ఞాప‌కం చేశారు. 

ALso Read:ఆ తర్వాత.. రాజ‌కీయాల‌కు దూరం.. సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రానికి బీజేపీ స‌ర్కార్.. వేల కోట్ల నిధులు అందించింద‌నీ, ఇప్ప‌టి వ‌ర‌కూ పోలవరం ప్రాజెక్టుకు రూ. 11వేల కోట్లు ఇచ్చామ‌ని, మరో రూ.700 కోట్లు ఇవ్వానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో మిగితా నిధుల‌ను కూడా విడుదల చేస్తోందనీ, ప్రాజెక్ట్ కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.  వేల కోట్ల నిధులు విడుద‌ల చేసినా..  జ‌గ‌న్ స‌ర్కార్ అసత్య ప్ర‌చారం చేస్తోంద‌నీ, పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హంవ్య‌క్తం చేస్తోంది. గతంలో అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారని ప్ర‌శ్నించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios