కర్నూల్: మంత్రులు ఒక చోట, సీఎం మరోచోట ఉండడం మంచిది కాదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో విభజన తప్పదని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం నాడు ఎంపీ టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయమన్నారు.

Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు

కర్నూల్‌లో కూడ మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. తాము ఎంతో కాలంగా కర్నూల్ లో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు

అమరావతిలో కూడ సచివాలయం కూడ ఏర్పాటు చేయాలని, విశాఖకు రాజధాని హంగులు ఉన్నట్టే అమరావతి,కర్నూల్‌లో కూడ ఉండాలని టీజీ వెంకటేష్  అభిప్రాయపడ్డారు. 

Also read:రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...

ఏపీలో రాజధాని విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై అమరావతి ప్రజలు మండిపడుతున్నారు.  కర్నూల్‌లో హైకోర్టు, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించింది.

Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు