Asianet News TeluguAsianet News Telugu

అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు

ఏపీ రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు ఉన్నట్టుగా జీఎన్ రావు కమిటీ అభిప్రాయపడింది. 

No devolapment in All over Ap Sate says GN Rao committee
Author
Amaravathi, First Published Dec 20, 2019, 5:40 PM IST

అమరావతి: ప్రాంతాల మధ్య అభివృద్దిని బ్యాలెన్స్ చేసేందుకు తాము కమిటీ రిపోర్టులో పొందుపర్చినట్టుగా జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది. ఏపీలో చాలా ప్రాంతాల్లో  సమతుల్యత లేదని కమిటీ అభిప్రాయపడింది. 

జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది.ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ జీఎన్ రావుతో పాటు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు

పరిపాలన కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించినట్టుగా జీఎన్ రావు కమిటీ  తెలిపింది. వరదముంపు లేని ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్రాన్ని  ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని సూచించినట్టుగా జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదికను రూపొందించినట్టుగా కమిటీ తేల్చి చెప్పింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇంకా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.  గత ప్రభుత్వం ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడ తాము పరిశీలించినట్టుగా తెలిపింది.

Also Read:ఏపీకి మూడు రాజధానులు: మరోసారి జగన్‌కు మద్దతుగా గంటా ప్రకటన

38 వేల మంది వినతులను పరిశీలించినట్టుగాజీఎన్ రావు తెలిపారు. సుమారు 2 వేల మంది రైతులతో తాను ప్రత్యక్షంగా  పరిశీలించినట్టుగా జీఎన్ రావు స్పష్టం చేశారు.అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను పరిశీలించినట్టుగా  కమిటీ తేల్చి చెప్పింది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం , వేసవి అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.

శ్రీబాగ్  ఒప్పందం మేరకు కర్నూల్ లో  హైకోర్టు ఉండాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. తుళ్లూరులోనే అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.విశాఖ, తుళ్లూరులలో కూడ హైకోర్టు బెంచ్‌లు ఉండాలని కూడ కమిటీ సూచించింది.

పరిపాలన కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించినట్టుగా జీఎన్ రావు కమిటీ  తెలిపింది. వరదముంపు లేని ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్రాన్ని  ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని సూచించినట్టుగా జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదికను రూపొందించినట్టుగా కమిటీ తేల్చి చెప్పింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇంకా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.  గత ప్రభుత్వం ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడ తాము పరిశీలించినట్టుగా తెలిపింది.

38 వేల మంది వినతులను పరిశీలించినట్టుగా తెలిపారు. సుమారు 2 వేల మంది రైతులతో తాను ప్రత్యక్షంగా  పరిశీలించినట్టుగా జీఎన్ రావు స్పష్టం చేశారు.అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను పరిశీలించినట్టుగా  కమిటీ తేల్చి చెప్పింది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం , వేసవి అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.

శ్రీబాగ్  ఒప్పందం మేరకు కర్నూల్ లో  హైకోర్టు ఉండాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. తుళ్లూరులోనే అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.విశాఖ, తుళ్లూరులలో కూడ హైకోర్టు బెంచ్‌లు ఉండాలని కూడ కమిటీ సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios