ఏపీ ప్రజలకు తాను అండగా ఉంటామని బీజేపీ  రెబెల్ ఎంపీ శతృఘ్నసిన్హా చెప్పారు. హీరో ఆఫ్ ది నేషన్ అంటూ  చంద్రబాబునాయుడును అభినందించారు.


న్యూఢిల్లీ: ఏపీ ప్రజలకు తాను అండగా ఉంటామని బీజేపీ రెబెల్ ఎంపీ శతృఘ్నసిన్హా చెప్పారు. హీరో ఆఫ్ ది నేషన్ అంటూ చంద్రబాబునాయుడును అభినందించారు.

సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ భవన్‌లో తలపెట్టిన 12 గంటల దీక్షకు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసి ఆయన మద్దతు ప్రకటించారు.వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పదన్నారు. నరేంద్ర మోడీకి ప్రధాని పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు.

బాబు పట్ల మోడీ ఉపయోగించిన భాష సరైంది కాదన్నారు. ఈ భాష మోడీకి హోదాకు తగదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది దేశానికి సంబంధించిన అంశమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు.

మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే పదవిలో కొనసాగడానికి అర్హత లేదన్నారు. తాను కూడ ఏపీ ప్రజలకు మద్దతుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

శతృఘ్నసిన్హా సినిమాల్లో ఎలా నిర్మోహ మాటంగా మాట్లాడుతారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తనకు ఎన్టీఆర్ హయాం నుండి తాను ఆయను చూస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. మ్యాన్ ఆఫ్ ప్రిన్సిఫల్స్ అంటూ బాబు శతృఘ్నసిన్హాను కొనియాడారు. దేశం కోసం ఆయన పోరాటం చేస్తారని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేంద్ర మంత్రిగా సంస్కరణలను తీసుకొచ్చాడని ఆయన గుర్తు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీకి అన్యాయం జరిగింది: కమల్‌నాథ్

మోడీపై విమర్శలు: గురజాడ గేయంతో రామ్మోహన్ నాయుడు ప్రసంగం

28 ఏళ్ల పరిచయం: బాబు దీక్షలో ఆజాద్

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు: శరద్ పవార్

మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్

దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు