న్యూఢిల్లీ: కేంద్రంలో  బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలను అమలు చేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హామీ ఇచ్చారు.

ఏపీకి  ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తలపెట్టిన దీక్షకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  సోమవారం నాడు మద్దతు ప్రకటించారు. ఇస్తామన్న నిధులు ఇవ్వకుండా... ఇచ్చిన నిధులను కూడ కేంద్రం వెనక్కు తీసుకొందని పవార్ విమర్శించారు.

ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారుమేమంతా ఏపీ ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజలకు న్యాయం చేసేందుకు తాము  అండగా నిలుస్తామన్నారు.

పార్లమెంట్‌లో  కేంద్రం తయారు చేసిన చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.   కేంద్రంతో మీరు చేసే పోరాటానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు మీ వెంట ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే  ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చనున్నట్టు  పవార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్

దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు