Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.ఈ నిర్ణయం తర్వాత సీఏఏకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 

Bjp, janasena alliance in AP:Pawan Kalyan supports to CAA
Author
Amaravathi, First Published Jan 16, 2020, 4:16 PM IST

విజయవాడ: సీఏఏపైన అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వామపక్షపార్టీలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 

 గురువారం నాడు విజయవాడలో బీజేపీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. లెఫ్ట్ పార్టీలకు తాను ఏమీ బాకీ లేనని ఆయన తేల్చి చెప్పారు.దేశంలోని ముస్లింలకు ముస్లింలకు పౌరసత్వం తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని పవన్ కళ్యాణ్ సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలకు సూచించారు. పాకిస్తాన్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.మైనార్టీలను రక్షించేందుకే కేంద్రం సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

also read:బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నందమూరి రామకృష్ణ ఫైర్

బీజేపీ, జనసేనల భావజాలం ఒక్కటేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలతో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. 

Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా

also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios