అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ: పొత్తు చర్చలు

పొత్తు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇవాళ మరోసారి చర్చించారు.

Andhra Pradesh Assembly Elections  2024:Chandrababu naidu and Pawan Kalyan meet Union Minister Amit Shah lns


అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు  న్యూఢిల్లీలో  శనివారంనాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ అయ్యారు.  బీజేపీతో పొత్తు విషయమై  అమిత్ షాతో  చర్చించనున్నారు.

also read:టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు?: సీట్ల సర్దుబాటుపై చర్చలు

పొత్తు విషయమై చర్చించేందుకు గాను చంద్రబాబు నాయుడు ఈ నెల  7వ తేదీన  బీజేపీ అగ్రనేతలతో చర్చించేందుకు  పవన్ కళ్యాణ్ , చంద్రబాబు న్యూఢిల్లీకి వచ్చారు.  గురువారం నాడు అర్ధరాత్రి వరకు  జే.పీ.నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు భేటీ అయ్యారు. గురువారం నాటి  చర్చలకు కొనసాగింపుగా  శుక్రవారం నాడు చర్చలు జరగాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా నిన్న చర్చలు జరగలేదు. శనివారం నాడు ఉదయం అమిత్ షాతో  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు భేటీ అయ్యారు.

also read:కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)

గురువారంనాటి సమావేశంలోనే  మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి సీట్ల షేరింగ్ విషయమై  చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది. అమిత్ షాతో చర్చల తర్వాత  పొత్తుల విషయమై  అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు.

బీజేపీతో పొత్తు విషయమై  గత మాసంలోనే  చంద్రబాబు నాయుడు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు.నెల రోజుల తర్వాత మరోసారి ఈ విషయమై చర్చల కోసం  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీకి బయలుదేరారు.  ఇవాళే పొత్తుపై మూడు పార్టీల నుండి ప్రకటన వచ్చే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios