అమరావతి: గతంలో టీడీపీ నేతలు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదా అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం నాడు  నోటీసులు జారీ చేశారు. 

also read:చట్ట సవరణతోనే అక్రమాలు: అసైన్డ్ భూములపై సీఐడీ అనుమానం

ఈ నోటీసులపై సోము వీర్రాజు ఇవాళ స్పందించారు.ప్రధాని మోడీ ఏపీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో బ్లాక్ బెలూన్లు, ప్ల కార్డులు ప్రదర్శించలేదా అని ఆయన గుర్తుచ చేశారు. సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన సమయంలో  ఆయన కారుపై రాళ్లతో దాడికి దిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తిరుపతి పార్లమెంట్ స్థానంలో బీజేపీ, జనసేనలు కలిసి పని చేస్తాయన్నారు. రాబోయే మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడ జనసేనతో చర్చిస్తామన్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ కళ్యాణ్ తో చర్చించినట్టుగా సోము వీర్రాజు తెలిపారు.