చట్ట సవరణతోనే అక్రమాలు: అసైన్డ్ భూములపై సీఐడీ అనుమానం

 చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు విషయమై సీఐడీ దర్యాప్తును  ముమ్మరం చేసింది.
 

AP CID officials probe on Amaravathi land issue lns


అమరావతి: చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు విషయమై సీఐడీ దర్యాప్తును  ముమ్మరం చేసింది.అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని ఉల్లంఘించి భూ బదిలీకి జోవోలు జారీ చేశారని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 

also read:ఏపీ సీఐడీ నోటీసులు: రేపు అమరావతికి చంద్రబాబు

ముగ్గురు బడా బాబులు  అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని సీఐడీ గుర్తించింది.47.39, 42.92, 14.07 ఎకరాల భూములను కొనగోలు చేశారని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భూములు కొనుగోలు చేసినవారు అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులని సీఐడీకి ఫిర్యాదులు అందాయి.

పట్టా భూములకు, అసైన్డ్ భూములకు వేర్వేరుగా  పరిహారం చెల్లించినట్టుగా అభియోగాలున్నాయి., గత ప్రభుత్వంలో  అసైన్డ్ భూముల చట్టానికి చేసిన సవరణల వల్లే అక్రమాలు చోటు చేసుకొన్నాయని సీఐడీ అభిప్రాయంతో ఉంది.

ఈ చట్ట సవరణల వల్లే  అమరావతి భూములకు సంబంధించిన పూలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. 2016 అసైన్డ్ భూముల స్వాధీనం, విక్రయం కోసం సవరణలతో జీవో 41 చంద్రబాబునాయుడు సర్కార్ జారీ చేసింది.1977 అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం ప్రకారం ఉల్లంఘనలు జరిగాయని  సీఐడీ అనుమానిస్తుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios