ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. గుంటూరులో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు 600 హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు.

ఆయన రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రప్రజలకు టీడీపీ అధినేత చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వైసీపీ వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు భూమన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదన్నట్లుగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని.. వారిద్దరూ ప్రజాద్రోహులుగా మిగిలిపోతారని కరుణాకర్ రెడ్డి విమర్శించారు.