వైసీపి కి చాలా చేశామని చెప్పిన అఖిల ప్రియా. తన తండ్రి చనిపోయిన రెండవ రోజు కార్యకర్తల కన్నీరు తూడ్చడానికి అసెంబ్లీకి వచ్చాను. రోజా మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.

భూమా కుటుంబం వైసీపి కి చాలా చేసింద‌ట‌, అలాగ‌ని మంత్రి అఖిల ప్రియ గురువారం నంద్యాల్లో చెప్పారు. ఆమె మాట‌లు విన్న వైసీపి శ్రేణులు ఆశ్చ‌ర్యపోతున్నారు. వైసీపి తాము చాలా చేశామ‌ని చెబుతున్న అఖిల ఎమీ చేశామో మాత్రం చెప్ప‌లేదు. అయితే పార్టీయో భూమా కుటుంబానికి ఇంత వ‌ర‌కు చాలా చేసిందని నేత‌లు చెబుతుంటే, తాజాగా అఖిల మాత్రం రివ‌ర్స్ లో మాట్లాడుతుంది.

 వైసీపిలో ఉండ‌గా భూమా నాగి రెడ్డికి జ‌గ‌న్ క్యాబినేట్ ర్యాంక్ క‌ల్పించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అదేవిధంగా శోభ నాగిరెడ్డి బ్ర‌తికి ఉన్న రోజుల్లో కూడా జ‌గ‌న్ ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చాడు. అయితే క్యాబినేట్ ర్యాంక్ ఇచ్చినా భూమా పార్టీ ఫిరాయించిన సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. వాస్త‌వం ఇద‌యితే. త‌మ కుటుంబమే వైసీపికి ఎంతో చేశామ‌ని చెప్ప‌డం విచిత్రంగా ఉంది.

అఖిల నేడు ప్రచారం లో పాల్గోన్నారు. నంద్యాల అబివృద్దికి టీడీపీ క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు మంత్రి అఖిల ప్రియ. వైపీపి నేత‌ల పై ప‌లు ఆరొప‌ణ‌లు చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి మాట‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర్చేలా ఉన్నాయ‌ని ఆరొపించారు అఖిల‌. ఆయ‌న మ‌హిళల పై చేసిన వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకొవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. శోభా నాగిరెడ్డి మృతి చెందిన రెండో రోజే తమ కుటుంబమంతా వెళ్లి వైసీపీకి ప్రచారం చేశామని ఆమె గుర్తు చేశారు.

త‌న తండ్రి మృతి చెందిన అనంతరం కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు అసెంబ్లీకి వెళ్లాన‌ని, ఇప్పుడు ఆ విష‌యాన్ని కూడా త‌ప్పుడ‌ప‌ట్ట‌డం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. రోజా దురుసు వ్యాఖ్య‌లు త‌గ్గించుకొవాలని సూచించారు. రోజా త‌న వ‌స్త్రాధార‌ణ‌పై విమ‌ర్శించాడాన్ని త‌ప్పుప‌ట్టారు. త‌న‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అఖిల డిమాండ్ చేశారు.