బాబును న‌ర‌రూప రాక్ష‌సుడన్నా భూమన వంగవీటీ రంగాను, పరిటాల హత్య కేసులో పాత్ర ఉందన్నా భూమన రాజకీయాలను భ్రస్టు పట్టిస్తున్నారని ఆరోపణ
ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపి నేత భూమన కరుణాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు, జగన్ పై చేసిన కామెంట్లను ఆయన తిప్పికొట్టారు. మంగళవారం కర్నూల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హత్య రాజకీయాలకు తెర తీసింది చంద్రబాబే అని ధ్వజమేత్తారు భూమన. బాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనంతపురంలో 400 మంది ఉచకోత కోస్తే కనీసం కేసులు కూడా నమోదు కాలేదని ఆయన ఆరోపించారు. బాబు నీచాతీ నీచుడని, నరరూప రాక్షసుడని ఆయన చరిత్ర చెబుతుందని భూమన విమర్శించాడు.
బాబు రాజకీయ నికృష్టుడని ఆనాడే ఎన్టీఆర్ అన్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వంగవీటి రంగాను నడిరోడ్డులో నరికించిన కుట్రదారుడు చంద్రబాబేనని అన్నారు. పరిటాల హత్య వెనుక బాబు హస్తం ఉందని అందిరికి తెలసునని ఆయన పెర్కొన్నారు. పరిటాల ఎదుగుదలను చూసి తట్టుకోలేక హాత్య చేయించారని ఆయన ఆరోపించారు. అవసరం ఉన్నప్పుడు కాళ్లు అవసరం తీరాక జట్టు పట్టుకోవడం బాబు నైజం అని విమర్శించారు.
తమ నాయకుడు జగన్ ఏం తప్పు చేశాడని క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. తన అధ్యక్షుడు రాజకీయాల్లో విలువలు ఉండాలని అనుక్షణం తపిస్తారని ఆయన పెర్కోన్నారు. బాబు రాజకీయాలకే అరిష్టం అని ధ్వజమెత్తారు. ప్రముఖుల నడిచిన అసేంబ్లీలో బాబు కాలు పెట్టడం శోచనీయం అని ఆయన విమర్శించారు. బాబు చేస్తున్న పనులకు రాజకీయాలే తలదించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు మాట్లాడే మాటలు దెయ్యాలను వళ్లిస్తున్నట్లుందని విమర్శించారు. అధికారం ఉందని నీచంగా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలపై టీడీపీ కుట్రపూరిత దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. బాబు నిజస్వరూపం ఏంటనేది ఆయన్ను రాజకీయంగా పెంచి పోషించిన ఎన్టీఆరే చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు తన సొంత తమ్ముడు అయినా రామ్మూర్తిని కూడా అమ్మానా బూతులు తిట్టారని రామ్ముర్తి నాయుడు తనతొ చెప్పాడని ఆరోపించారు. సోనియా గాంధీ, బాబు కుమ్మకై జగన్ ను జైలుకు పంపించారిని భూమనా ధ్వజమెత్తారు.
