తాము కుదిర్చిన వివాహం చేసుకోవడంతో పాటు పెళ్లినే రద్దు చేసుకోవడానికి కారణమైన కూతురును  గొంతు నులిమి చంపేసి మృతదేహన్ని దగ్దం చేశారు తల్లిదండ్రులు. 

ఒంగోలు: తాము కుదిర్చిన వివాహం చేసుకోవడంతో పాటు పెళ్లినే రద్దు చేసుకోవడానికి కారణమైన కూతురును గొంతు నులిమి చంపేసి మృతదేహన్ని దగ్దం చేశారు తల్లిదండ్రులు. ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని ఆ యువతి పట్టుబట్టింది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో చోటు చేసుకొంది.

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పందరబోయిన ఆవులయ్య బీఎస్ఎఫ్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన హైద్రాబాద్ మెట్రో రైల్వేలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్ద కూతురుకు, కొడుకుకు వివాహం చేశాడు. రెండో కూతురు ఇంద్రజకు వివాహం చేయాలని ఆయన భావించాడు.

గత ఏడాది ఇంద్రజకు ఆమె మేనత్త కొడుకుతో నిశ్చితార్థం జరిపించాడు. మేనత్త కొడుకుతో పెళ్లికి ఇంద్రజ ఒప్పుకోలేదు. 10 రోజుల పాటు అన్న,పానీయాలు ముట్టుకోలేదు. దీంతో ఇంద్రజతో వివాహన్ని మేనత్త కుటుంబం రద్దు చేసుకొంది

పెళ్లి రద్దు కావడంతో అక్టోబర్ 28వ తేదీ రాత్రి కూతురు ఇంద్రజపై కోపంతో ఆమెను గోడకు అదిమి గొంతు నులిమాడు. దీంతో ఆమె చనిపోయింది. ఇంద్రజ మృతదేహన్ని మచంతో పాటు గ్రామ వెలుపలకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి దగ్దం చేశాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు ఆవులయ్యను విచారించారు.

తన కూతురును చంపానని ఆవులయ్య ఒప్పుకొన్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన చైతన్య అనే దళిత యువకుడిని ఇంద్రజ ప్రేమించింది. ఈ కారణంతోనే మేనత్త కొడుకుతో పెళ్లికి ఆమె ఒప్పుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూతురును ఆవులయ్య చంపేశారని స్థానికులు చెబుతున్నారు. 

సంబ:దిత వార్తలు

ప్రకాశంలో పరువు హత్య... దళితుడిని ప్రేమించినందుకు కూతుర్ని చంపిన తండ్రి

మరో పరువు హత్య: లవ్ మ్యారేజ్ చేసుకొన్న కూతురిని కొట్టి చంపిన పేరేంట్స్

కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

మరో పరువు హత్య: కూతురిని చంపిన పేరేంట్స్

మరో పరువు హత్య.. బావమరదుల చేతిలో హతం

ప్రణయ్ లాగే శంకర్ ది కూడా పరువు హత్యే...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

పరువు హత్య: యువతిని చంపేసిన తండ్రి, అన్న

పరువు హత్య: ప్రేమించి పెళ్లి చేసుకొన్న కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి