వరసుకు బాబాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేని ఓ తండ్రి తన కూతురును  కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.

హైదరాబాద్: వరసుకు బాబాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేని ఓ తండ్రి తన కూతురును కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన హైద్రాబాద్‌కు సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోటు చేసుకొంది.

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన విజయ వరుసకు బాబాయ్‌ సురేష్‌ను ప్రేమించింది. దీంతో ప్రేమించిన సురేష్‌ను విజయ వివాహం చేసుకొంది. నాలుగేళ్ల క్రితం సురేష్,విజయలు పెళ్లి చేసుకొన్నారు. అప్పటి నుండి ఆ దంపతులు ఊరికి దూరంగా ఉంటున్నారు. పెళ్లైన నాటి నుండి ఆ దంపతులు ఇంతవరకు గ్రామానికి రాలేదు.

నాలుగేళ్ల క్రితం నుండి వారంతా గ్రామానికి రాలేదు. సురేష్ తల్లి మృతి చెందింది. దీంతో సురేష్‌తో విజయ దంపతులు వచ్చారు. అయితే సురేష్ తల్లి దశదినకర్మ పూర్తైన తర్వాత గ్రామం విడిచి వెళ్లాలని వారు భావించారు.

అయితే అత్త చనిపోయిందని ఇంటికి వచ్చిన విజయతో ఆమె తండ్రి నర్సింహ్మతో పాటు కుటుంబసభ్యులు మూడు రోజులుగా గొడవ పెట్టుకొంటున్నారు. బుధవారం రాత్రి కూడ నర్సింహ్మ తన కూతురితో గొడవకు దిగినట్టు స్థానికులు చెప్పారు.

మరోవైపు గురువారం సురేష్ ఇంట్లో లేని సమయంలో విజయను ఆమె తల్లి ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చింది. తండ్రి నర్సింహ్మతో పాటు మరికొందరు తీవ్రంగా కొట్టారు. గొంతుకోసి చంపేశారు. 

విజయ చనిపోయిందని భావించిన తర్వాత నర్సింహ్మ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.