ప్రకాశం జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నాగిరెడ్డిపల్లికి చెందిన ఇంద్రజ అనే యువతి ఉరేసుకుని చనిపోవడంతో అతని తండ్రి పాపయ్య తెల్లవారుజామున దహనసంస్కారాలు నిర్వహించాడు. ఎవ్వరికి చెప్పకుండా... ఎవ్వరి కంటపడకుండా ఉదయాన్నే కూతురి అంత్యక్రియలు నిర్వహించడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె గత కొంతకాలంగా దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటుందని... ఇది నచ్చని తండ్రే ఆమెను హతమార్చి వుంటాడని వారు భావిస్తున్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు పాపయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా...తన కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది పరువుహత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
 

మరో పరువు హత్య: లవ్ మ్యారేజ్ చేసుకొన్న కూతురిని కొట్టి చంపిన పేరేంట్స్

కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

మరో పరువు హత్య: కూతురిని చంపిన పేరేంట్స్

మరో పరువు హత్య.. బావమరదుల చేతిలో హతం

ప్రణయ్ లాగే శంకర్ ది కూడా పరువు హత్యే...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

పరువు హత్య: యువతిని చంపేసిన తండ్రి, అన్న

పరువు హత్య: ప్రేమించి పెళ్లి చేసుకొన్న కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి