Asianet News TeluguAsianet News Telugu

ఒంగోలులో గిరిజనుడిపై దారుణం.. చితకబాది, నోట్లో మూత్రం పోసి, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని ఒత్తిడి.. వీడియో

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ గిరిజనుడిపై పలువురు దుండగులు మూకమ్మడి దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడి నోట్లో మూత్రం పోశారు. మర్మాంగాన్ని నోట్లో పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 
 

Atrocity on a tribal in Ongole.. Crushed, put urine in his mouth and pressured him to put the corpse in his mouth.. Video,,ISR
Author
First Published Jul 19, 2023, 7:04 AM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఓ గిరిజన యువకుడిపై పలువురు దుండగులు అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని తీవ్రంగా చికతబాది, నోట్లో మూత్రం పోశారు. ఆ మూత్రం పోసే వ్యక్తి, తన మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని కూడా బాధితుడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన నెల రోజుల కిందట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మహిళతో బీజేపీ నేత కిరీట్ సోమయ్య న్యూడ్ వీడియో కాల్.. వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు

బాధితుడి ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలకు చెందిన మెటా నవీన్ అనే గిరిజన యువకుడు, మన్నె రామాంజనేయులు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఎప్పుడూ జులాయిగా తిరిగే వీరిద్దరూ పలు నేరాలకు పాల్పడుతుండేవారు. వీరిద్దరూ కలిసి పలు దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. పోలీసులు వీరిపై ఇప్పటి వరకు సుమారు 50 చోరీ కేసులు నమోదు చేశారు. 

ఇందులో నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే మరో వ్యక్తి అంజి పోలీసులకు చిక్కడం లేదు. కాగా.. కొంత కాలం నుంచి వీరద్దరికి పొరపచ్చాలు వచ్చాయి. మనస్పర్థలు రావడంతో పెద్దగా కలిసి ఉండటం లేదు. ఈ క్రమంలో నెల రోజుల కిందట అంజి నవీన్ కు కాల్ చేశాడు. ఒంగోలులోని కిమ్స్ మెడికల్ కాలేజ్ వెనక్కి రావాలని ఆహ్వానించాడు. మద్యం సేవిద్దామని చెప్పాడు.

ప్రధానిపై పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు - మల్లికార్జున్ ఖర్గే సంచలన ప్రకటన

అతడి మాటలు నవీన్ అక్కడి వెళ్లాడు. కానీ అక్కడ అంజి ఒంటరిగా లేడు. చుట్టుపక్కలా ప్రాంతాలకు చెందిన మరో 9 మంది యువకులు అంజితో పాటు ఉన్నారు. ఈ క్రమంలో వీరంతా కలిసి మద్యాన్ని సేవించారు. మద్యం తాగుతున్న సమయంలోనే వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అంజి గత వివాదాన్ని ముందుకు తేవడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కాగా.. అప్పటికే ప్లాన్ పై ప్రకారం అక్కడున్న యువకులంతా ఆ గిరిజనుడిపై దాడికి పాల్పడ్డారు. 

విడిచి పెట్టాలని నవీన్ ఎంతగా ప్రాధేయపడ్డా.. వాళ్లు వినిపించుకోలేదు. క్రూరంగా రక్తం వచ్చేయాలని కొట్టారు. దాంతోనే దుండగులు ఆగలేదు. బాధితుడి నోట్లో మూత్ర విసర్జన చేశారు. దానిని తాగాలని ఒత్తిడి చేస్తూ, మళ్లీ కొట్టడం మొదలుపెట్టారు. ఆ మూత్రం పోసే వ్యక్తి మర్మాంగాన్ని బాధితుడి నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేశారు. దీనిని అక్కడున్న పలువరు తమ ఫోన్ లోని కెమెరాలతో వీడియో తీశారు.

వార్నీ.. ప్రియురాలిని చీకట్లో కలిసేందుకు ఊరు మొత్తానికే కరెంట్ కట్ చేసిన ప్రియుడు.. ఇద్దరూ సన్నిహితంగా ఉండగా..

దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులపై వారు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే నిందితులు తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. పోలీసు ఉన్నతాధికారు వరకు అది వెళ్లింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios