సారాంశం

మహారాష్ట్ర బీజేపీ కీలక నేత, లోక సభ కిరీట్ సోమయ్య అభ్యంతరకర స్థితిలో ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా చూపించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిని ఆయన ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే దీనిని విడుదల చేశారని తెలిపారు.

మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజీపీ) సీనియర్ నేత, ఎంపీ కిరీట్ సోమయ్య ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న ఆయన.. ఈ ప్రైవేట్ వీడియోలో అభ్యంతరకర స్థితిలో ఉండటం అనేక ఊహాగానాలకు, విస్తృత చర్చలకు దారితీసింది

ప్రధానిపై పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు - మల్లికార్జున్ ఖర్గే సంచలన ప్రకటన

మరాఠీ న్యూస్ ఛానల్ 'లోక్షాహి' ఈ వీడియో ఫుటేజీని మొదటగా పోస్ట్ చేసింది. అయితే అందులో మహిళ గుర్తింపును వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే దీనిపై లోక్ షాహి ఎడిటర్ కమలేష్ సుతార్ మాట్లాడుతూ.. తాము ఎవరి ప్రైవసీకి భంగం కలిగించడం లేదని, వీడియో ప్రామాణికత, సంబంధిత ఫిర్యాదులపై సోమయ్య నుంచి వివరణ కోరాలని కోరారు.

సోమయ్యతో సంబంధం ఉన్న క్లిప్ ను పోలిన అనేక క్లిప్ లు కూడా తమ దృష్టికి వచ్చాయని సుతార్ వెల్లడించారు. ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడాన్ని గోప్యతకు భంగం కలిగించినట్లుగా భావించినప్పటికీ, ఒక ప్రధాన రాజకీయ పార్టీలో సోమయ్య స్థానంలో ఉన్న వ్యక్తి తప్పును పరిష్కరించడం ముఖ్యమని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై తరచూ అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణలు చేస్తున్న సోమయ్య లాంటి వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉండటం పట్ల ఆ ఛానల్ విస్మయం వ్యక్తం చేసింది.

కాగా.. సోమయ్యకు సంబంధించిన అభ్యంతరకర వీడియో బయకురావడంతో రాజకీయ నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నాయకురాలు విద్యా చవాన్ మాట్లాడుతూ.. కిరీట్ సోమయ్యకు అశ్లీల చర్యలకు పాల్పడుతూనే.. మరొకరిపై బురద జల్లే నైతిక హక్కు లేదని అన్నారు. ‘‘కిరీట్ సోమయ్యకు సంబంధించిన వీడియో ఫుటేజ్ చూసి నేను వ్యక్తిగతంగా నిరాశకు గురయ్యాను. అతడి దూకుడు ప్రవర్తన, అభ్యంతరకర హావభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిని బహిర్గతం చేసిన ప్రముఖ వ్యక్తిగా, ఇలాంటి దుష్ప్రవర్తన నిజమైతే, తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను’’ అని అన్నారు. 

వార్నీ.. ప్రియురాలిని చీకట్లో కలిసేందుకు ఊరు మొత్తానికే కరెంట్ కట్ చేసిన ప్రియుడు.. ఇద్దరూ సన్నిహితంగా ఉండగా..

కాంగ్రెస్ కు చెందిన యశోమతి ఠాకూర్ కూడా సోమయ్య, బీజేపీపై విరుచుకుపడ్డారు. నైతికత గురించి తరచూ మాట్లాడే బీజేపీ నేతలకు కిరీట్ సోమయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకునే ధైర్యం ఉండాలని అన్నారు. ఆయనపై వచ్చిన ఈ ఆరోపణలను పరిష్కరించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 'సేవ్ డాటర్స్, ఎడ్యుకేట్ డాటర్స్' వంటి ప్రచారాలను సమర్థించే వారి ప్రజా ప్రతిష్ఠను ఇలాంటివి దెబ్బతీస్తాయని అన్నారు.

ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. 105 పురాతన వస్తువులను భారత్ కు అప్పగించిన యూఎస్

కాగా.. ఈ వీడియోను రాజకీయ కుట్రని కిరీట్ సోమయ్య కొట్టిపారేశారు. లోక్షాహి ప్రసారం చేసిన వివాదాస్పద వీడియోపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున ఈ వీడియోను విడుదల చేయడం రాజకీయ ప్రేరేపితమని, తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. తాను నిర్దోషినని చెప్పారు. పోలీసుల విచారణలో నిజానిజాలు వెల్లడవుతాయని సోమయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.