పవన్ వ్యాఖ్యల ఎఫెక్ట్: టీడీపీ ఆఫీసుకి రాజోలు, రాజానగరం తెలుగు తమ్ముళ్లు, సర్ధిచెప్పిన అచ్చెన్నాయుడు
రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమౌంది. ఈ విషయమై పార్టీ నాయకత్వంతో చర్చించేందుకు ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు శనివారంనాడు మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ నెల 26వ తేదీన రాజోలు, రాజానగంర అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అరకు, మండపేటల్లో ఇద్దరు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు.ఒత్తిడిలో భాగంగా చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఉండవచ్చని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు కూడ కార్యకర్తల నుండి ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు.ఈ క్రమంలోనే రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
also read:టీడీపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది: పవన్ వ్యాఖ్యల వెనుక మతలబు ఏమిటి?
దీంతో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి తెలుగు దేశం పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో సమావేశమయ్యారు. ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలకు అచ్చెన్నాయుడు సర్దిచెప్పి పంపారు.
ఈ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలతో చంద్రబాబు మాట్లాడుతారని అచ్చెన్నాయుడు కార్యకర్తలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
also read:జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?
రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను కూడ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ తరుణంలోనే చంద్రబాబు రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన కూడ రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.ఈ ప్రకటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
also read:జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ
తెలుగుదేశం, జనసేన సీట్ల సర్ధుబాటు కారణంగా ఎవరెవరు సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందోననే విషయమై రెండు పార్టీల నేతల్లో గుబులు కూడ లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.