టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కొందరు రాజకీయ నేతలు ఆడవాళ్లను ముందుపెట్టి అమరావతిలో ఉద్యమం చేయిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read:జగన్ సర్కార్ సంచలనం... అమరావతిలో స్థానిక ఎన్నికల్లేవ్!

వాళ్లు మాత్రం ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారని, ఆడవారిని రోడ్ల మీదకు వదిలి పోలీసులు కొట్టారంటూ ఏడుస్తున్నారని విమర్శించారు. అమరావతిలో మగవాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ము లేదా అంటూ ఎద్దేవా చేశారు.

మీరు చేసిన తప్పులకు ఆడవారిని ఎందుకు బలి చేస్తున్నారని రోజా విరుచుకుపడ్డారు. అక్కడి మహిళలంతా స్వార్థం కోసమే ఉద్యమం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి మహిళలను తరలించి అమరావతిలో ధర్నాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు.

Also Read:పవన్‌ను బూతులు తిట్టిన ద్వారంపూడిని ఏమీ అనరా: ముద్రగడకు టీడీపీ కౌంటర్

లోకేశ్ స్నేహితుడైన ఓ డైరెక్టర్ మన వాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్లి బాగా ధర్నా చేస్తున్నారని ట్వీట్ చేశారంటూ ఆమె బాంబు పేల్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరులో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానని, తనకు స్వార్థముంటే తిరుపతిలోనే రాజధాని పెట్టాలని అడిగేదాన్నని రోజా స్పష్టం చేశారు.

మరోవైపు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కానుంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు సహా పలు కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీతో పాటు మండలి సమావేశాలు జరుగుతాయని శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.