కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖకు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. కాపులకు టీడీపీ హయాంలో చంద్రబాబు అనేక రకాలుగా మేలు చేశారని, జగన్ అధికారంలోకి వచ్చాకా కాపులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించింది.

వైసీపీ నేత ద్వారంపూడి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బూతులు తిట్టినా స్పందించరా అంటూ ముద్రగడను ప్రశ్నించింది. కాపు కార్పోరేషన్‌కు చెందిన నిధులను మళ్లించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయరా అని టీడీపీ మండిపడింది.

Also Read:పవన్ కల్యాణ్ తో దోస్తీ: చంద్రబాబుకు బిజెపి భారీ షాక్

కాపులు అధికంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా రాజధానిని మారుస్తుంటే ఎందుకు ఖండించలేదని తెలుగుదేశం ప్రశ్నించింది. కాపులకు అన్యాయం చేస్తున్న జగన్‌కు ముద్రగడ లేఖ రాయాలని టీడీపీ డిమాండ్ చేసింది. 

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఆదివారం నాడు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. భానుగుడి సెంటర్ నుండి జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వైపు ర్యాలీగా వెళ్లారు.

Also Read:వైసీపీ ఎమ్మెల్యే బూతులు... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

అయితే  ఈ విషయం తెలుసుకొన్న వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడి ఒకరికి వ్యతిరేకంగా మరోకరు తిట్టుకొన్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకొన్నారు.  వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను తిప్పికొట్టారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద  భారీగా పోలీసులు మోహరించారు.  ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. రాళ్ల దాడిలో పలువురు జనసేన  కార్యకర్తలు గాయపడ్డారు.