టీడీపీ బద్దశత్రువు విజయసాయిరెడ్డి తారకరత్నకు మామ ఎలా అయ్యాడు? భార్య అలేఖ్య షాకింగ్ డిటైల్స్!
వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డికి తారకరత్న స్వయానా అల్లుడు. భిన్నమైన రాజకీయ నేపథ్యం కలిగిన వీరు బంధువులు ఎలా అయ్యారనేది ఆసక్తికర పరిణామం.
Taraka Ratna
ఎన్టీఆర్ మనవడిగా మాత్రమే తారకరత్న పరిచయం. ఆయన వ్యక్తిగత విషయాలు తెలిసింది కొందరికే. ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన మోహనకృష్ణ కొడుకుల్లో ఒకరు తారకరత్న. నందమూరి వంశం నుండి హీరోగా తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తారకరత్న వ్యక్తిగత విషయాలపై జనాలు పెద్దగా ఫోకస్ పెట్టలేదు.
Taraka Ratna
అయితే తారకరత్న జీవితంలో ఆసక్తికర కోణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితం. తారకరత్న విడాకులైన యువతిని వివాహం చేసుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి తో తారకరత్నది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి గుడిలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. తారకరత్న పేరెంట్స్ ఈ పెళ్ళికి ససేమిరా అన్నారట. అలేఖ్య రెండో పెళ్లి అమ్మాయి కావడమే దీనికి ప్రధాన కారణం.
Taraka Ratna
2011లో తారకరత్న నందీశ్వరుడు టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఈ చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లి బంధానికి దారి తీసింది. సంగీ టెంపుల్ లో 2012లో తారకరత్న-అలేఖ్యల వివాహం ఫ్రెండ్స్ మధ్య జరిగింది. మొదట్లో బెట్టుగా ఉన్న తారకరత్న పేరెంట్స్ అనంతరం ఒప్పుకుని దగ్గరకు తీసుకున్నారు.
Taraka Ratna
తారకరత్న దంపతులకు ఒక అమ్మాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే అలేఖ్య వైసీపీ లీడర్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూతురు వరస అవుతుంది. అలేఖ్య తల్లి విజయసాయిరెడ్డి భార్య సునందకు స్వయానా చెల్లి. విజయసాయిరెడ్డి, సునంద అలేఖ్యకు పెదనాన్న, పెద్దమ్మ అవుతారు. ఆ విధంగా తారకరత్న విజయసాయిరెడ్డికి అల్లుడు అయ్యారు.
Taraka Ratna
పార్టీలు, సిద్ధాంతాల రీత్యా వీరు ఉత్తర దక్షిణ ధృవాలు. వరసకు మాత్రం బంధువులు. అత్తింటి చుట్టాలుగా విజయసాయిరెడ్డితో తారకరత్నకు మంచి అనుబంధమే ఉందట. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుకుంటారట. విజయసాయిరెడ్డి తారకరత్నకు మామయ్య అవుతారన్న విషయం చాలా మందికి తెలియదు.
Taraka Ratna
అలేఖ్య-తారకరత్న అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఇక తారకరత్న ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెండు రోజులుగా ఆమె ఆసుపత్రి వద్ద భర్త తిరిగి వస్తారని పడిగాపులు పడుతున్నారు. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది.