- Home
- Entertainment
- తారకరత్న దెబ్బకు ఇండస్ట్రీ నివ్వెరపోయింది.. ఉప్పెనలా 9 చిత్రాలతో రికార్డ్, అప్పట్లో ఏం జరిగిందంటే
తారకరత్న దెబ్బకు ఇండస్ట్రీ నివ్వెరపోయింది.. ఉప్పెనలా 9 చిత్రాలతో రికార్డ్, అప్పట్లో ఏం జరిగిందంటే
నందమూరి తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. నందమూరి వంశం నుంచి వచ్చిన హీరో కావడంతో తారకరత్నపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా నందమూరి తారకరత్న మరణించారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కుప్పంలోనే తారకరత్నకి చికిత్స జరిగింది. అప్పటికే ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారింది. ఆ తర్వాత ఆయన్ని బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించారు
గత 20 రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతున్న తారకరత్న నేడు శనివారం ప్రాణాలు విడిచారు. గుండె ఎడమవైపున 90 శాతం బ్లాక్ ఏర్పడడంతో తారకరత్న పరిస్థితి విషమంగానే కొనసాగింది. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ తారకరత్న అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దీనితో అభిమానులకు, నందమూరి కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిలింది. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని సంఘటన.
నందమూరి తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. నందమూరి వంశం నుంచి వచ్చిన హీరో కావడంతో తారకరత్నపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటికే జూ.ఎన్టీఆర్ ఆది సూపర్ హిట్ తో మంచి జోరు మీద ఉన్నాడు. బాలయ్య తర్వాత నందమూరి ఫ్యామిలిలో ఎన్టీఆర్, తారక రత్న ఇద్దరూ సూపర్ స్టార్స్ అవుతారని ఫ్యాన్స్ అనుకున్నారు.
అంతకు ముందే ఇండస్ట్రీ మొత్తం నివ్వెర పోయేలా తారకరత్న ఒకేసారి రికార్డు స్థాయిలో 9 చిత్రాలకు సైన్ చేశాడు. ఇది ఇండస్ట్రీలో సంచలనం రేపింది. తొందరపాటు నిర్ణయాలో, ప్రణాళికా వైఫల్యమో కానీ ఆ తర్వాత తారకరత్నకి సరైన హిట్ లభించలేదు. నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి తారక రత్న ఫేడ్ అవుట్ అవుతూ వచ్చారు. 9 చిత్రాల్లో కొన్ని మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవి కూడా పరాజయం చెందాయి.
అయితే తారకరత్న 9 చిత్రాలకు ఒకేసారి సైన్ చేయడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. జూ. ఎన్టీఆర్ కి పోటీగానే తారకరత్న ఆ పని చేసినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో నందమూరి ఫ్యామిలిలో జూ. ఎన్టీఆర్ కి అంతగా యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. ఎన్టీఆర్ జోరుకి బ్రేకులు వేసేందుకే తారకరత్నని రంగంలోకి దించారనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై గతంలో తారకరత్న చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తమ్ముడు జూ.ఎన్టీఆర్ కి పోటీగా నేను ఇండస్ట్రీకి వచ్చాను అనేది పూర్తిగా అవాస్తవం. నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకే ఎన్టీఆర్ ఆది లాంటి సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఆ టైంలో నేను రావడంతో అంతా అలా అనుకున్నారు. సినిమాల మీద ఆసక్తితోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నందమూరి పేరు నిలబడుతోంది అంటే ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కూడా ఒక కారణం. ఎన్టీఆర్ సక్సెస్ నాకు కూడా సంతోషాన్ని ఇస్తోంది. ఎవరైనా నందమూరి ఫ్యామిలీనే కదా అని తారకరత్న అన్నారు.
సినిమాలకు దూరం అయ్యాక తారకరత్న రాజకీయాల్లో రాణించాలని ఆశపడ్డారు. అందుకే టీడీపీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఇలా జరగడం అత్యంత దురదృష్టకరం.