Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల ఓటు తో రాష్ట్ర రాజ‌కీయం మారుతుందా...?

  • నంద్యాల ఓటు తో రాష్ట్ర రాజకీయం మారుతుందన్నా జగన్
  • టీడీపీ పై విమర్శలు
  • కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును పంచుతున్నారన్నా జగన్
  • చంద్రబాబు హాయాంలో అవినీతి పెరిగిపోయింది.
ap politics will change with nandyala elections

నంద్యాల ఓటుతో ఆంధ్ర‌ రాజ‌కీయాలు మారుతుందా..  అవున‌నే అంటున్నారు వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహన్ రెడ్డి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భాగంగా జ‌గ‌న్ మూడ‌వ రోజు ప‌ర్య‌టిస్తున్నారు. చాపిరేవుల,  తాపిరేవుల‌ గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గోన్న ఆయ‌న‌ టీడీపీ పాల‌న‌ పై ద్వ‌జ‌మెత్తారు.

మూడున్న‌రేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నంద్యాల‌ నియోజకవర్గానికి రాని మంత్రులు, ఉప ఎన్నిక న‌గారా మోగ‌గానే మంత్రి వ‌ర్గం అంతా నంద్యాల్లో దిగిపోయింద‌ని జ‌గ‌న్‌ ఎద్దేవా చేశారు.టీడీపీ నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ప్రతి సామాజిక వర్గాన్ని అధికార పార్టీ డ‌బ్బును ఎర‌గా వేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. డ‌బ్బుకు లొంగ‌క‌పోతే టీడీపీ నాయ‌కులు వ‌త్తిళ్ల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు. 


టీడీపీ నాయ‌కుల‌ను త‌మ శ్రేణుల‌ను కూడా డ‌బ్బుతో మ‌భ్య‌పెడుతున్నార‌ని, లొంగ‌క‌పోతే  బెదిరింపులు చేస్తున్నారని జ‌గ‌న్‌ ధ్వ‌జ‌మెత్తారు. అందుకు త‌మ నాయ‌కుడు ఆంధ్ర మెడిక‌ల్ షాపు పై  దాడిని ఉదాహరించారు. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపుకి తిప్పుకొవ‌డానికి టీడీపీ వంద‌ల కోట్ల రూపాయ‌లు అవినీతి సొమ్మును పంచుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. 


 టీడీపీ అభివృద్ది ప‌నుల చెయ్య‌లేరు, కానీ ప్ర‌జ‌ల మ‌భ్య‌పెట్ట‌డంలో మాత్రం ఆరితేరార‌ని అని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్ల కాలంలో బాబు ఏ ఒక్క హామీ కూడా ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని  జ‌గ‌న్ సూచించారు. బాబు హాయాంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేకపోయారన్నారు, దాని ఫ‌లితంగా మ‌న రాష్ట్రం ఇప్పుడు  అదోగ‌తి పాల‌యింద‌న్నారు. రాష్ట్రానికి ఎమైనా కేంద్రం మంచి చేస్తే అది చంద్ర‌బాబు ఖాతాలో వెసుకుని,  ఎదైనా చెడు జ‌రిగితే కేంద్రం ఖాతాలోకి వేసి త‌ప్పించుకుంటారని ఆయ‌న ఆరోపించారు.

   
 మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా ప్ర‌జ‌లు ఓటు వెయ్యాల‌ని జ‌గ‌న్ పిలునిచ్చారు. ఆయ‌న తెలిపారు. తాము అధికారంలో కి  వ‌స్తే తాము ప్రవేశ‌పెట్టిన న‌వ‌రత్నాలు ప‌థ‌కాలు రాష్ట్రానికి వ‌స్తాయ‌ని ఆయ‌న ఈ సంధ‌ర్బంగా పెర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios