కేంద్రప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం తప్పదనే ఆనవాయితీని మోడీ ప్రభుత్వం కొనసాగించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘‘ఓట్ ఆన్ బడ్జెట్‌’’ను కేంద్ర ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టారు.

సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఆయన ప్రసంగంలో ఎక్కడా ఏపీ ప్రస్తావన లేదు. తెలుగు ఎంపీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోన్న విభజన హామీలు కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరికీ కేటాయింపులు, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి పన్నుల్లో రాయితీలు, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇలాంటి వాటిలో వేటికి పీయూష్ గోయెల్ పట్టించుకోలేదు.

విశాఖకు రైల్వే జోన్ పక్కా అంటూ రెండు, మూడు రోజులుగా కొందరు బీజేపీ నేతలు చేసిన హడావుడితో ఎన్నికలు కాబట్టి ఇస్తారు కాబోలు అని సగటు ప్రజలు ఆశపడ్డారు. కానీ మోడీ ప్రభుత్వం వాటిపై నీళ్లు చల్లింది. దీంతో ఏపీలో అధికార టీడీపీ, ప్రజలు, ప్రజా సంఘాలు కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. 

కేంద్ర బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

సామాన్యులకు వరాలు: గోయల్ ఎన్నికల బడ్జెట్

రూ.5లక్షలు కాదు.. రూ.6.5లక్షల వరకు పన్ను మినహాయింపు

బడ్జెట్ ఎఫెక్ట్: లాభాల్లో స్టాక్ మార్కెట్లు