ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి వనితకు బుధవారం నాడు స్వల్పగాయాలయ్యాయి. మంత్రి కాన్వాయ్‌లోని వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రికి గాయాలయ్యాయి.

Also read:రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి

సంక్రాంతి పర్వదినం రోజున కుటుంబసభ్యులతో కలిసి మంత్రి వనిత స్వగ్రామ నుండి విజయవాడకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని మూడు జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మంత్రి వాహనం బైక్ ను ఢీకొని డివైడర్‌ను ఢీకొంది.

Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందారు. మంత్రి కాన్వాయ్‌లోని వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న మంత్రి వనితకు గాయాలయ్యాయి.