మార్కాపురం: డాక్టర్ సుధాకర్‌తో గానీ, ఆయన తల్లితో మాట్లాడినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్దమేనని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 

ఆదివారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ ను మేనేజ్ చేయడానికి తాను రంగంలోకి దిగినట్టుగా టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

మీ పార్టీకి, మీకు మేనేజ్ చేయడం అలవాటని ఆయన విమర్శించారు. డాక్టర్ సుధాకర్ ను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. 

also read:మహిళా పోలీసు చేయి పట్టుకుని తనను వదలాలని ఏడ్చింది: డా. సుధాకర్

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకొంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళితులకు క్షమాపణ చెప్పించాలని ఆయన వర్ల రామయ్యను కోరారు. టీడీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. దళితులకు జగన్ ఏ రకమైన పథకాలు అందిస్తున్నారో ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.

also read:డా సుధాకర్ పై దాడి: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్, సీబీఐ విచారణకు ఆదేశం

డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై సీబీఐ విచారణకు  ఏపీ హైకోర్టు ఈ నెల 22వ తేదీన ఆదేశించింది. ఎనిమిది వారాల్లో ఈ ఘటనకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది హైకోర్టు.