Asianet News TeluguAsianet News Telugu

మహిళా పోలీసు చేయి పట్టుకుని తనను వదలాలని ఏడ్చింది: డా. సుధాకర్

సస్పెన్షన్ కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్ తన వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలు వెల్లడించారు. ఓ మహిళా పోలీసు తన చేయి పట్టుకుని ఏడ్చిందని సుధాకర్ చెప్పారు.

Dr Sudhakar reveals astonishing incidents in his sttaement
Author
Visakhapatnam, First Published May 24, 2020, 8:50 AM IST

అమరావతి: సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ తన వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలు వెల్లడించారు. తనను పిచ్చివాడిగా, తాగుబోతుగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖ 5వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ స్వయంగా వెళ్లి సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ వాంగ్మూలంలో ఆయన విస్తుపోయే విషయాలు వెల్లడించారు 

పోలీసులే తన వాహనంలో మద్యం బాటిళ్లు పెట్టారని ఆయన ఆరోపించారు. తాను 2013 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనస్థీషియా)గా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిలో నార్మల్ సర్జికల్ మాస్కులు కావాలని తాను ఆస్పత్రి సూపరింటిండెంట్ నీలవేణిని అడిగానని, స్టాక్ లేవని చెప్పారని ఆయన చెప్పారు. విశాఖ వైద్య సేవల సమన్వయకర్త నాయక్ ని అడిగినా కూడా సెంట్రల్ డ్రగ్ స్టోర్ లోనే స్టాక్ లేవని చెప్పారని ఆయన అన్నారు. 

తాను దీర్ఘకాలంగా మధుమేహం, బీపీ తదితర సమస్యలకు చికిత్స తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో సెలవుకు దరఖాస్తు పెట్టుకున్ని, ఎస్మా వల్ల తిరస్కరించారని చెప్పారు. తమ ఆస్పత్రిని కరోనా ఐసోలేషన్ కేంద్రంగా మార్చారని చెప్పారు. 

మరోసారి మాస్కుల గురించి....

ఆస్పత్రిని నర్సీపట్నం ఆర్డీవో సందర్శించినప్పుడు మరోసారి మాస్కుల గురించి అడిగానని, అనస్థీషియా నిపుణుడికి మాస్క్ అవసరం లేదని సమాధానం ఇచ్చారని సుధాకర్ చెప్పారు. ఏప్రిల్ 6వ దగ్గు, జలుబు ఉన్న రోగిని ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కు తెచ్చారని, దాంతో సబ్ స్టోర్ నుంచి ఎన్-95 మాస్కు అడగాలని స్టాఫ్ కి చెప్పానని ఆయన అన్నారు. రిజిష్టర్ లో తన సంతకం తీసుకుని ఫార్మాసిస్ట్ ఎన్-95 మాస్క్ తీసుకొచ్చి దాన్ని 15 రోజుల పాటు వాడాలని చెప్పాడని ఆయన చెప్పారు.

మొబైల్ ద్వారా రికార్డు చేశా...

మాస్కులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కుంటున్న ఆపరేషన్ థియేటర్ సిబ్బంది వీడియోలను సర్జరీ ముగిసిన తర్వాత మొబైల్ ద్వారా రికార్డు చేశానని సుధాకర్ చెప్పారు ఆ వీడియోలను చూపించేందుకు ఆస్పత్రి కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే పెట్ల గణేష్ వద్దకు వెళ్లానని, ఆయన మున్సిపల్ కార్యాలయంలో కరోనాపై సమావేశంలో ఉన్నారని అక్కడికి వెళ్లానని, గంట పాటు నిరీక్షించినా ఫలితం లేకపోయిందని వివరించారు. 

దాంతో గత ప్రభుత్వంలో ఆస్పత్రి సలహా కమిటీ చైర్మన్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడి వద్దకు వెళ్లానని, ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కలువలేకపోయానని సుధాకర్ చెప్పారు. మళ్లీ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. అక్కడ ెన్-95 మాస్కులు ధరించి ఉన్న ఆర్డీవో, ఎమ్మెల్యే, అదనపు ఎస్పీ, సీఐలను కలిశానని చెప్పారు.

తమ సూపరింటిండెంట్ నీలవేణి మాత్రం సింపుల్ సర్జికల్ మాస్క్ ధరించి ఉన్టన్లు ఆయన తెలిపారు. తాను ఆపరేషన్ థియేటర్ సిబ్బంది కోసం ెన్-95 మాస్కులు అడగ్గానే వారు ఆగ్రహం వ్యక్తం చేశారని, తను దూషిస్తూ సమావేశం నుంచి గెంటేశారని, ఇది చూసిన మీడియా సిబ్బంది ఏం జరిగిందంటూ చుట్టుముట్టారని, దాంతో జరిగిన విషయం చెప్పానని ఆయన అన్నారు. ఏప్రిల్ 8వ తేదీ తెల్లవారు జామున 5 గంటలకు అంబులెన్స్ డ్రైవర్ రాము నుంచి తన సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నట్లు సుధాకర్ తెలిపారు. 

మహిళా కానిస్టేబుల్ నా చేయి పట్టుకుని....

పది రోజుల క్రితం, అంటే 20వ తేదీన పోర్ట్ ట్రస్ట్ వెనక వైపు సమీపంలో స్కోడా కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ అబ్బాయి బుల్లెట్ బైక్ ను సీజ్ చేశారని, అది జరిగిన 3 రోజుల తర్వాత తాను 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కుమారుడి వాహనం గురించి అడిగానని ఆయన చెప్పారు. 

ఆ సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ వచ్చి తన చేయి పట్టుకుని తనను వదలాలంటూ ఏడ్చిందని సుధాకర్ చెప్పారు. దాంతో పోలీసులు తనను కొట్టారని, ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యేలా తప్పు కేసులు పెడుతామని బెదిరించారని ఆయన వివరించారు. తన కుమారుడు లాక్ డౌన్ కాలంలో వాహనం నడిపినట్లుగా కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు. తన బ్యాగులో ఉన్న తన మొబైల్, కారు తాళాలు, వేయి రూపాయలు తీసుకుని తనను పంపించేశారని డాక్టర్ సుధాకర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios