Asianet News TeluguAsianet News Telugu

పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో తేలాలి: రోజా సంచలనం

పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా  సంచలన వ్యాఖ్యలు  చేశారు. 

AP Minister  Roja  Sensational Comments  On  Pawan Kalyan lns
Author
First Published Jul 28, 2023, 2:03 PM IST | Last Updated Jul 28, 2023, 2:35 PM IST

అమరావతి: పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్కతేలాల్సిన అవసరం ఉందని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా  చెప్పారు.శుక్రవారంనాడు ఏపీ మంత్రి  రోజా అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. 

ఏపీలో మహిళల  మిస్సింగ్ పై ఏ నిఘా సంస్థ సమాచారం ఇచ్చిందో  పవన్ కళ్యాణ్ బయట పెట్టాలని ఆమె డిమాండ్  చేశారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు అని  ఆమె విమర్శించారు.రాయలసీమ ప్రాజెక్టులకు పరిశీలించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.హెరిటేజ్ లో గంజాయి, నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతుందని  ఆమె ఆరోపణలు చేశారు. రాయలసీమలో పుట్టి ప్రజల ఆశీర్వాదంతో  చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారన్నారు. కానీ రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడ చంద్రబాబు పూర్తి చేయలేదని  ఆమె విమర్శించారు.  అలాంటి చంద్రబాబుకు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

పవన్ కళ్యాణ్ పై కొనసాగుతున్న మంత్రుల విమర్శలు

వాలంటీర్లపై   జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల  9వ తేదీన  ఏలూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  మహిళల అక్రమ రవాణాలో  వాలంటీర్లు దోహదపడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు  తీవ్ర స్థాయిలో విమర్శలు  చేస్తున్నారు.  ఈ వ్యాఖ్యలను  ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పవన్ కళ్యాణ్ పై కోర్టులో ఫిర్యాదు చేయాలని  ఈ నెల 20న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

also read:ఆధారాలు చూపాలి: పవన్ పై వాలంటీర్ ఫిర్యాదుపై విజయవాడ కోర్టు కీలక వ్యాఖ్యలు

 ఈ మేరకు  ఈ నెల  24న  మహిళ వాలంటీర్  విజయవాడ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమ పరువుకు భంగం కల్గించేలా ఉన్నాయని  పేర్కొన్నారు.  అయితే  ఈ వ్యాఖ్యలపై పరువుకు భంగం కల్గించాయనేందుకు ఆధారాలు చూపాలని  కోర్టు  మహిళా వాలంటీర్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై   ఏపీ మంత్రులు,  వైఎస్ఆర్‌సీపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు  చేస్తున్నారు. ఇవాళ కూడ ఏపీ మంత్రి రోజా  పవన్ కళ్యాణ్  సీరియస్ వ్యాఖ్యలు చేశారు.  

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios