మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీదేనని ఏపీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. తనపై విష ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల ఈ రోజు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై ఏపీ మంత్రి పరిటాల సునీత స్పందించారు.

మహిళా ఎమ్మెల్యేలను కూడా ఏడ్పించిన ఘనత జగన్ కే దక్కుతుందని సునీత పేర్కొన్నారు. సాటి మహిళలపై గౌరవం ఉంటే..షర్మిల ముందుగా తన అన్న జగన్ చొక్కా పట్టుకొని నిలదీయాలని ఆమె అభిప్రాయపడ్డారు. స్త్రీలను తోబుట్టువులుగా భావించే పార్టీ టీడీపీ అని ఆమె వివరించారు. షర్మిళతోపాటు ఏ మహిళపై ఇలాంటి ప్రచారం జరిగినా.. టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.

తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి పనిచేసే పార్టీ టీడీపీ అన్నారు. మహిళా ఐఏఎస్ అధికారులను, మహిళా మంత్రులను జైలుపాలు చేసిన చరిత్ర జగన్ దేనని ఆమె ఆరోపించారు. వికృత చర్యలకు సోషల్ మీడియాను కేరాఫ్ గా చేసుకుంది జగన్ అని విమర్శించారు. 

మరిన్ని సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల