ఏపీ ఐటీశాఖ మంత్రి లోకేష్.. ప్రేమలేఖ  ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆయన రాసింది భార్య బ్రహ్మిణి కి అనుకొని పొరపడేరు. దేశ ప్రధాని నరేంద్రమోదీకి లోకేష్ ఈ ప్రేమ లేఖ రాశారు. ఏపీక ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున లోకేష్ ఉత్తరం రాశారు. 

‘‘ఈ లేఖ తెరవండి సార్, మీరు దీన్ని చెత్త బుట్టలో వేస్తారని తెలుసు. కానీ మీరు ఇక్కడ ఇచ్చిన మాట గురించి కనీసం క్షణం పాటైనా ఆలోచించండి’’ అంటూ లోకేష్ ప్రధానికి ఘాటైన సూచన చేశారు. ఈ ఉత్తరం ద్వారా ప్రత్యేక హోదా రాదని తెలిసినా వినూత్నంగా నిరసన తెలపడం కోసం లోకేష్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. 

‘‘ప్రత్యేక హోదా కోరుతూ ప్రధానికి పోస్ట్ కార్డ్ పంపాను. మీరు కూడా ఆయనకు పోస్ట్ కార్డ్ పంపండి. ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి #ToPMWithLove అనే హ్యాష్ ట్యాగ్ వాడండ’’ని లోకేష్ ప్రజలను కోరారు. 

 

దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండని ఇంగ్లిష్‌లో రాసిన లేఖను న్యూఢిల్లీ రెజినా హిల్స్‌లోని ప్రధాని కార్యాలయానికి లోకేష్ పోస్టు చేశారు.కాగా ఆ లేఖలో లోకేష్ అమరావతి స్పెల్లింగ్‌తోపాటు సెక్రటేరియట్ స్పెల్లింగ్ తప్పుగా రాయడం పట్ల నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముందు స్పెల్లింగ్స్ సరిగా రాయడం నేర్చుకోవాలంటూ లోకేష్ కి సూచిస్తున్నారు.