రాజధాని వికేంద్రీకరణ తథ్యం.. అమరావతి కూడా వుంటుంది: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులు (ap three capitals), అమరావతిపై (amaravathi) మంత్రి కొడాలి నాని (kodali nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని నాని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని మంత్రి స్పష్టం చేశారు. 

ap minister kodali nani sensational comments on ap three capitals

మూడు రాజధానులు (ap three capitals), అమరావతిపై (amaravathi) మంత్రి కొడాలి నాని (kodali nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని నాని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి అందరిదీ అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారంటూ టీడీపీపై (tdp) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే.. పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టిన రాజధాని అమరావతి అని కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తమ ప్రభుత్వానికి ఒక్కటేన‌ని… 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చెయ్యాలని నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) చెప్పారని మంత్రి గుర్తుచేశారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. తనకు చెందిన వారికి లబ్ది చేకూర్చేందుకే ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు (chandrababu naidu) దోపిడీ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కొడాలి నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Also Read:YS Jagan - KCR: కేసీఆర్‌, జగన్ భేటీలో ఏం జరిగింది?.. అందుకే మూడు రాజధానులపై జగన్ వెనక్కి తగ్గారా..?

కాగా.. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడంపై అసెంబ్లీలో (ap assembly) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విస్తృత, విశాల ప్రయోజనాలు కాపాడేందుకే బిల్లును వెనక్కి తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు  ఆమోదించిన వెంటనే ప్రక్రియ ప్రారంభమై వుంటే మంచి ఫలితాలు వచ్చి వుండేవని జగన్ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టామని సీఎం స్పష్టం చేశారు. 3 రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని చట్టాల ఉపసంహరణ తాత్కాలికమేనని ఆయన చెప్పారు. 

అమరావతిలో రాజధాని, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు ఖర్చవుతుందని సీఎం అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా అని ఆయన నిలదీశారు. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ అని.. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయని జగన్ చెప్పారు. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఆ తర్వాత గతంలో సీఆర్‌డీఏను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios