అమరావతి: ట్రాక్టర్ నడపలేని వాడు... పార్టీని ఏం నడుపుతాడని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.

also read:తప్పిన ముప్పు: నారా లోకేష్ మీద పోలీసు కేసులు

మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదలు ఎప్పుడు వచ్చాయి.. ఎప్పుడు పరిశీలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. లోకేష్ గురించి మాట్లాడడం కూడ అనవసరమన్నారు. పార్టీ నేతలతో ట్రాక్టర్ ను నడుపుకొంటూ వెళ్తున్న లోకేష్ .. ట్రాక్టర్ గోతిలో వేశాడని చెప్పారు. 

also read:చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆ పార్టీలోని తెలివిగల నేతలు ముందే మేల్కోవాలని ఆయన సూచించారు. ట్రాక్టర్ ను గోతిలో పడేసినట్టే పార్టీని కూడ లోకేష్ నట్టింట్లో ముంచెత్తి పోతారని చెప్పారు.
అవసరమైతే ట్రాక్టర్ ను కూడ లోకేష్ దిగి వెళ్లిపోతారని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనికిరాని వాడు.. పార్టీని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించాడు. 

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో వరద ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ట్రాక్టర్ పై వెళ్లున్న సమయంలో ప్రమాదవశాత్తు కాల్వలోకి ట్రాక్టర్ దూసుకుపోయింది.ఈ సమయంలో పక్కనే పార్టీ నేత ట్రాక్టర్ ను అదుపు చేశారు.