అమరావతి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబునాయుడు జగన్ దెబ్బకు  శాసనమండలి గ్యాలరీ ఎక్కారని ఏపీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. రానున్న రోజుల్లో చంద్రబాబును అసెంబ్లీ గ్యాలరీకి పరిమితం చేయాలని కొడాలి నాని  చెప్పారు.

 గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో శాసనమండలిలో చోటు చేసుకొన్న పరిణామాలపై జరిగిన మంత్రి కొడాలి నాని మాట్లాడారు. పెద్దల సభ అంటే బరువున్న వ్యక్తులున్న సభ కాదన్నారు మంత్రి.  ఎన్టీఆర్‌ శాసనమండలిని రద్దు చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి  శాసనమండలిని పునరుద్దరించి లోకేష్‌కు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారన్నారు.

బిల్లులను ఆపే అధికారం శాసనమండలికి లేదని మంత్రి నాని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగాలనే ఉద్దేశ్యంతో మండలిలో బిల్లును ప్రవేశపెట్టినట్టుగా ఆయన చెప్పారు. 

 యనమల రామకృష్ణుడు పేరు చెబితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయం గుర్తుకు వస్తోందన్నారు. నిన్న శాసనమండలిలో యనమల రామకృష్ణుడు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు  పొడిచారని మంత్రి కొడాలి నాని  చెప్పారు

.ఛైర్మెన్ కు ఆశోక్ బాబు పేపర్లు ఇచ్చినట్టుగా ఎక్కడా కన్పించలేదన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే పాలనా వికేంద్రీకరణ బిల్లును తమ ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా మంత్రి కొడాలి నాని చెప్పారు.

 శాసనమండలిలో పీడీఎఫ్ తో బీజేపీకి చెందిన సుమారు 15 మంది సభ్యులు మేధావులు ఉన్నారని కొడాలి నాని చెప్పారు.   శాసనమండలికి మంత్రులు మద్యం తాగి వచ్చినట్టుగా యనమల రామకృష్ణుడు విమర్శలు చేయడంపై మంత్రి కొడాలి నాని  ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Also read:అధికారులను బాధ్యులను చేస్తాం: సీఆర్‌డీఏ రద్దు బిల్లు విచారణ వాయిదా

 ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సభల్లో తాము తిరుగుతున్నామన్నారు. శాసనసభలో మద్యం తాగినట్టుగా, జర్ధా వేసుకొన్నట్టుగా వాసన రాలేదా అని కొడాలి నాని ప్రశ్నించారు.  మండలిలోకి రాగానే  మద్యం వాసన ఎలా వచ్చిందో చె్పపాలని ఆయన ప్రశ్నించారు.

రాజకీయ నిరుద్యోగులంతా  శాసనమండలిలో చేరారని మంత్రి నాని విమర్శలు గుప్పించారు.  శాసనమండలిని ఉంచాలో .. తీసేయాలో ఆలోచించాలని మంత్రి కొడాలి నాని సీఎం జగన్ ను కోరారు.అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం జగన్   ధైర్యంగా నిర్ణయం తీసుకొన్నారని కొడాలి నాని చెప్పారు.