కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా సర్పవరం టైకీ పరిశ్రమలో గురువారం నాడు రియాక్టర్ పేలుడు సంఘటనలో మృతిచెందిన కుటుంబాలకు మంత్రి కన్నబాబు శుక్రవారం నాడు పరిహారం చెల్లించింది.

రియాక్టర్ పేలుడు ఘటనలో కాకర్ల సుబ్రమణ్యం, తోటకూర వెంకటరమణ మృతి చెందారు. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించింది ప్రభుత్వం.ఇవాళ మంత్రి కన్నబాబు బాధిత కుటుంబాలకు చెక్కులను అందించారు.  కంపెనీ యాజమాన్యంతో చర్చించిన తర్వాత పరిహారం చెల్లించారు.

also read:సర్పవరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్: ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

బాధిత కుటుంబాల్లోని ఒకరికి పరిశ్రమలో ఉద్యోగం కల్పించాలని యాజమాన్యానికి సూచించినట్టుగా మంత్రి తెలిపారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 4 లక్షలు చెల్లిస్తామని మంత్రి చెప్పారు.రియాక్రర్ పేలుడుకు గల కారణాలపై కూడ దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు 

రియాక్టర్ పేలుడు కారణంగా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ మంటలను ఆర్పేందుకు గాను ఫైరింజన్లను రప్పించారు. ఫైరింజన్లు సకాలంలో రావడంతో మంటలను అదుపు చేశారు. 
.