తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరం టైకీ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం నాడు బాయిలర్ పేలింది.ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకొంది. బాయిలర్ పేలుడుకు గల కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.  సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

 

ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులను కోరారు.బాయిలర్ పేలుడుతో మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందకు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

ముందస్తు చర్యలు తీసుకోలేదు. కెమికల్ కులపుతున్న సమయంంలో ప్రమాదవశాత్తు బెయిలర్ పేలుడు చోటు చేసుకొంది.సంఘటన స్థలాన్ని  మంత్రి కన్నబాబు సందర్శించారు. కంపెనీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.