కర్నూల్: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేసినట్టుగా బెంజీకారు తన కొడుకుది కాదని ఏపీ రాష్ట్ర మంత్రి జయరాం ప్రకటించారు.ఈఎస్ఐ స్కాంలో  ఏ 14 నిందితుడిగా ఉన్న కార్తీక్ మంత్రి జయరాం కొడుకుకి  బెంజీకారు గిఫ్ట్ ఇచ్చాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.ఈ ఆరోపణలపై మంత్రి జయరామ్  తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చూపిన ఫోటో గురించి మంత్రి జయరాం వివరించారు. అయ్యన్పపాత్రుడు చూపించిన ఫోటోలోని బెంజీ కారు తన కొడుకుది కాదని ఆయన ప్రకటించారు.

also read:ఈఎస్ఐ స్కాంలో మంత్రి జయరాం పాత్ర: సంచలన ఆరోపణలు చేసిన అయ్యన్నపాత్రుడు

కారు పక్కనే ఫోటో మాత్రమే దిగాడని ఆయన చెప్పారు. హెలికాప్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకొంటే అవి మనవే అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.టీడీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకు చంద్రబాబునాయుడు పదవులు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.