Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం: ప్రజా గర్జనలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  కార్మికులు  చేస్తున్న పోరాటాన్ని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్  అభినందించారు.

AP Minister  Gudivada Amarnath  Supports Visakha Steel plant  workers  protest
Author
First Published Jan 30, 2023, 9:29 PM IST

విశాఖపట్టణం: విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  కార్మికులు  చేస్తున్న  పోరాటాన్ని  ఏపీ  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్  అభినందించారు.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు తాము  వ్యతిరేకమని  మంత్రి తెలిపారు.  సోమవారం నాడు  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం నాడు నిర్వహించిన  విశాఖ ఉక్కు ప్రజా గర్జన సభలో   ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్  పాల్గొన్నారు. 

విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు  చేశారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్  కార్మికుల  పోరాటానికి తాము  పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన  చెప్పారు.  విశాఖ ఉక్కు  తెలుగోడి హక్కు  అని  మంత్రి చెప్పారు. విశాఖ ఉక్కు కేంద్రం హక్కు కాదన్నారు.   విశాఖ పట్టణం స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  రెండు సార్లు  ప్రధానికి  లేఖ రాసిన విషయాన్ని మంత్రి గుర్తు  చేశారు.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను  నిరసిస్తూ  700 రోజులకు పైగా  ఆందోళనలు నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు  చేశారు.

also read:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: 36 గంటల సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

 స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  పెద్ద ఎత్తున  ఆందోళనలు నిర్వహిస్తున్న  కార్మికులను మంత్రి అభినందించారు.  విశాఖలో  ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు  కోసం  ఆానాడు 32  మంది ఆత్మార్పణం చేసిన  విషయాన్ని  మంత్రి ప్రస్తావించారు.  సముద్ర తీర ప్రాంతంలో  ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమేనని  మంత్రి చెప్పారు. ఈ ఫ్యాక్టరీ  నిర్మాణం కోసం  1960లో  ఉద్యమం ప్రారంభమైందన్నారు.  2020లో  కూడా  ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని ఉద్యమం చేయాల్సిన  పరిస్థితులు  నెలకొన్నాయన్నారు.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ చేయవద్దని  కేంద్ర ప్రభుత్వానికి  సీఎం జగన్ రెండు దఫాలు లేఖలు రాసిన విషయాన్ని  మంత్రి అమర్ నాథ్ గుర్తు  చేశారు.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ   సిద్దాంతాలకు అతీతంగా  పార్టీలు  మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన  గుర్తు  చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios