విశాఖపట్నం: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబును తనిఖీ చేయడం తప్పుకాదన్నారు. ప్రతీ చిన్న విషయాన్ని రాజకీయం చేయడం టీడీపీకి అలవాటుగా మారిందన్నారు. 

మరోవైపు విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమలకు భూముల కేటాయింపులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. 

అవినీతిపరులను ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అక్రమాల బూజు దులుపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో తెలుస్తోందని స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు భద్రతపై టీడీపీ ఆరోపణలు సరికాదు: పోలీస్ శాఖ క్లారిటీ

హోదాపై 14వ ఆర్థికసంఘం అడ్డు చెప్పలేదు, లేఖ బయటపెట్టిన సీఎం జగన్: మోదీకి అందజేత

చంద్రబాబుకు మావోల నుంచి థ్రెట్ : టీడీపీ ఎమ్మెల్యేల అర్థనగ్న ప్రదర్శన

గన్నవరం విమానాశ్రయంలో బాబుకు తనిఖీలు: ఘాటుగా స్పందించిన విజయసాయి

చంద్రబాబు ఒక్కరే కాదు, రాజధానిపై అపోహలు అనవసరం: మంత్రి బొత్స సత్యనారాయణ